LOADING...
Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు ఓకే, ఫలితాలపై స్టేకు నో
ఫలితాలపై స్టేకు నో

Meenakshi Natarajan: మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో ఊరట.. పిటిషన్ విచారణకు ఓకే, ఫలితాలపై స్టేకు నో

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 11, 2026
01:20 pm

ఈ వార్తాకథనం ఏంటి

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల వివాదంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో కొంత ఊరట లభించింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను శుక్రవారం విచారణకు స్వీకరించేందుకు అత్యున్నత న్యాయస్థానం అంగీకరించింది. అయితే ఎన్నికల ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలన్న అభ్యర్థనను మాత్రం తిరస్కరించింది. మీనాక్షి నటరాజన్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపిస్తూ, ఈ అంశాన్ని అత్యవసరంగా విచారించాలని కోరారు. తెలంగాణలో నమోదైన ఓ ప్రైవేట్ ఫిర్యాదులో భాగంగా ఆమెకు కేవలం నోటీసు మాత్రమే జారీ అయిందని, ఆ కేసును సంబంధిత కోర్టు ఇంకా విచారణకు స్వీకరించలేదని తెలిపారు. అంతేకాకుండా, ఇప్పటివరకు ఛార్జిషీట్ కూడా దాఖలు కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

వివరాలు 

ఎన్నికల ఫలితాలపై స్టే విధించాలన్న విజ్ఞప్తి తిరస్కరణ 

ఈ పరిస్థితుల్లో దానిని క్రిమినల్ కేసుగా పరిగణించలేమని కాంగ్రెస్ వాదించింది. అందువల్ల రాజ్యసభ ఎన్నికల నామినేషన్ పత్రాల్లో ఆ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఎన్నికల నిబంధనల ప్రకారం కూడా కేవలం నోటీసు దశలో ఉన్న అంశాలను తప్పనిసరిగా వెల్లడించాల్సిన నిబంధన లేదని అభిషేక్ మను సింఘ్వీ సుప్రీంకోర్టుకు వివరించారు. వాదనలు విన్న సుప్రీంకోర్టు పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు అంగీకరించినప్పటికీ, ఎన్నికల ఫలితాలపై స్టే విధించాలన్న విజ్ఞప్తిని తిరస్కరించింది.

Advertisement