PM Modi: ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చేసింది: ఎన్నికల షెడ్యూల్‌పై మోదీ
లోక్‌సభ ఎన్నికల తేదీల ప్రకటన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రజాస్వామ్యంలో అతిపెద్ద పండుగ వచ్చిందని ప్రధాని మోదీ అన్నారు. ఎన్నికలకు బీజేపీ-ఎన్డీయే పూర్తిగా సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. సుపరిపాలన, అన్ని రంగాల్లో సేవలందిస్తున్న ట్రాక్ రికార్డు ఆధారంగా తాము ప్రజల్లోకి వెళ్తున్నామన్నారు. ఈ మేరకు ప్రధాని మోదీ వరుస ట్వీట్లు చేశారు. తమ పాలనలో రంగం కూడా స్కామ్‌ల బారిన పడలేదన్నారు. తాము పక్షపాతాన్ని చూపలేదన్నారు. 140 కోట్ల మంది భారతీయుల శక్తితో భారత్ అభివృద్ధిలో కొత్త రికార్డులు సృష్టిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. భారత్ ఇప్పుడు ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించినట్లు చెప్పారు.
గత 10ఏళ్లలో డెబ్బై ఏళ్లు శూన్యాన్ని పూరించాం: మోదీ
తమ పాలనలో కోట్లాది మంది ప్రజలు పేదరికం నుంచి విముక్తి పొందారని మోదీ అన్నారు. తమ పథకాలు భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు చేరుకున్నాయన్నారు. అందుకే, భారతదేశంలోని నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు 400సీట్లను దాటాలని ముక్త కంఠంతో నినదిస్తున్నాయని మోదీ అన్నారు. ప్రతిపక్ష పార్టీలకు ఒక లక్ష్యమంటూ లేదన్నారు. బీజేపీని నిందించి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. వారి వంశపారంపర్య విధానం, సమాజాన్ని విభజించే ప్రయత్నాలను ఎప్పటికీ సమాజం అంగీకరించదన్నారు. అవినీతికి సంబంధించిన ట్రాక్ రికార్డ్ సమానంగా హాని కలిగిస్తోందన్నారు. అలాంటి నాయకత్వాన్ని ప్రజలు కోరుకోరని స్పష్టం చేశారు. మూడో టర్మ్‌లో ఇంకా చాలా పనులు చేయాల్సి ఉందన్నారు. గత 10ఏళ్లలో డెబ్బై ఏళ్లు పాలించిన వారు సృష్టించిన శూన్యాన్ని పూరించామన్నారు.