LOADING...
School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..
తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..

School Holidays : తెలంగాణ విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఈనెలలో హాలిడేస్ ఎక్కువే..

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 04, 2025
10:53 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అదిరిపోయే గుడ్‌న్యూస్. మరోసారి వరుసగా మూడురోజుల సెలవులు రాబోతున్నాయి. ఈనెలలో హాలిడేలు ఎక్కువగా రాబోతున్నాయి. సెప్టెంబర్ 5వ తేదీ (శుక్రవారం) నుంచి సెప్టెంబర్ 7వ తేదీ (ఆదివారం) వరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ఉంటాయని ప్రభుత్వం ప్రకటించింది. సెప్టెంబర్ 5వ తేదీ మిలాద్ - ఉన్ - నబీ మహ్మద్ ప్రవక్త జయంతి సందర్భంగా రాష్ట్రంలో సెలవు దినంగా ఉంది. సెప్టెంబర్ 6వ తేదీ (శనివారం) హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనాల సందర్భంగా సెలవు. సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం కావడంతో ఇది సాధారణ సెలవు. ఫలితంగా, విద్యార్థులు వరుసగా మూడురోజులు సెలవులు పొందనున్నారు.

వివరాలు 

వరుస మూడ్రోజులు సెలవలతో  పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రణాళికలు 

గణేశ్ నిమజ్జనం సందర్భంగా సెప్టెంబర్ 6వ తేదీన హైదరాబాద్,సికింద్రాబాద్ జంట నగరాలు, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల ప్రభుత్వ కార్యాలయాలు, పాఠశాలలు, కళాశాలలకు కూడా సెలవు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ముఖ్య కార్యదర్శి బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులకే కాకుండా, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ రంగంలోని ఉద్యోగులు కూడా ఈ మూడురోజుల లాంగ్ వీకెండ్‌ను ఆస్వాదించగలుగుతున్నారు. చాలా మంది వరుసగా మూడ్రోజులు సెలవులు రావడంతో కుటుంబం, స్నేహితులతో గడిపేందుకు, పర్యాటక ప్రాంతాలకు వెళ్లే ప్రణాళికలు వేసుకుంటున్నారు. ఇంకా,ఈ నెలలోనే దసరా సెలవులు కూడా రాబోతున్నాయి.సెప్టెంబర్ 21న బతుకమ్మ పండుగలు రాష్ట్రంలో ప్రారంభమవుతాయి. అదే రోజు నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకు మొత్తం 13 రోజుల పాటు పాఠశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించనుంది.