Page Loader
Cherlapally railway station: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చర్లపల్లి నుంచి మరో నాలుగు రైళ్లు: దక్షిణమధ్య రైల్వే 
ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చర్లపల్లి నుంచి మరో నాలుగు రైళ్లు: దక్షిణమధ్య రైల్వే

Cherlapally railway station: ప్రయాణికులకు బిగ్ అలెర్ట్.. చర్లపల్లి నుంచి మరో నాలుగు రైళ్లు: దక్షిణమధ్య రైల్వే 

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 12, 2025
10:12 am

ఈ వార్తాకథనం ఏంటి

దక్షిణ మధ్య రైల్వే మంగళవారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం,సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి నడిచే నాలుగు రైళ్లను చర్లపల్లి టెర్మినల్‌కు మార్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో పునర్నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు రైల్వే బోర్డు ఈ మార్పుకు ఆమోదం తెలిపింది. సుమారు రూ.720 కోట్ల వ్యయంతో స్టేషన్‌ పునరాభివృద్ధి పనులను దశల వారీగా అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. తిరుపతి-ఆదిలాబాద్‌ కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ (17405) రాత్రి 8.10 గంటలకు చర్లపల్లి టెర్మినల్‌ నుంచి బయల్దేరుతుంది.

వివరాలు 

కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు

బొల్లారం స్టేషన్‌లో రాత్రి 9.14 గంటలకు ఆగుతుంది. ఆదిలాబాద్‌ నుంచి తిరుగు ప్రయాణంలో (17406), బొల్లారం స్టేషన్‌కు ఉదయం 4.29కి, చర్లపల్లికి ఉదయం 5.45కి చేరుకుంటుంది. మార్చి 26 నుండి ఈ మార్పు అమల్లోకి వస్తుంది. కాకినాడ-లింగంపల్లి ప్రత్యేక రైలు (07446) ఉదయం 7.20 గంటలకు చర్లపల్లి నుంచి ప్రయాణం ప్రారంభించి, లింగంపల్లికి ఉదయం 9.15కి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (07445) ఈ రైలు లింగంపల్లి నుంచి సాయంత్రం 6.30కి బయల్దేరి, రాత్రి 7.30కి చర్లపల్లికి చేరుకుంటుంది. ఈ మార్పు ఏప్రిల్‌ 2 నుండి జులై 1 వరకు అమల్లో ఉంటుంది.

వివరాలు 

కాజీపేట-హదాప్సర్‌ ఎక్స్‌ప్రెస్‌

కాజీపేట-హదాప్సర్‌ ఎక్స్‌ప్రెస్‌ (17014) రాత్రి 8.20కి చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (17013), ఈ రైలు తెల్లవారుజామున 3.00 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఈ మార్పు ఏప్రిల్‌ 22 నుండి అమల్లోకి రానుంది. లింగంపల్లి-విశాఖపట్నం జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌ (12806) ఉదయం 7.15 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో (12805) ఈ రైలు సాయంత్రం 6.05 గంటలకు చర్లపల్లికి వస్తుంది. ఈ మార్పు ఏప్రిల్‌ 25 నుండి అమల్లోకి రానుంది.