Page Loader
అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు
రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం.. రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Jul 28, 2023
10:47 am

ఈ వార్తాకథనం ఏంటి

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం సంభవించింది. తాజాగా పాంగిన్ ఉత్తర దిశలో రిక్టర్ స్కేలుపై 4.0 తీవ్రతతో భూ ప్రకంపణలు వచ్చినట్టు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ ప్రకటించింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం 8.50 గంటల సమయంలో భూమి కంపించిందని పేర్కొంది. రాష్ట్రంలోని సియాంగ్ ప్రాంతంలో దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం చోటు చేసుకున్నట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) గుర్తించింది. జులై 22,ఆదివారం ఉదయం తవాంగ్‌లో రిక్టర్ స్కేలుపై 3.3 తీవ్రతతో ఉదయం 6.56 గంటలకు భూమి కంపించిందని NCS వెల్లడించింది. ఈ మేరకు సుమారు 5 కిలోమీటర్ల లోతులో భూప్రకంపణలు వచ్చినట్లు వివరించింది. వారం రోజుల వ్యవధిలో రెండు సార్లు భూకంపం నమోదవడం గమనార్హం.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

అరుణాచల్ ప్రదేశ్‌లో మరోసారి భూకంపం