
మొదటి భార్య రీల్స్ చూస్తున్నాడని, భర్త మర్మాంగాలపై బ్లేడ్‌తో దాడి చేసిన రెండో భార్య
ఈ వార్తాకథనం ఏంటి
ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లా నందిగామలో భర్త మర్మంగాలపై రెండో భార్య బ్లేడుతో దాడి చేసింది. మొదటి భార్య ఇన్‌స్టా రీల్స్ చూస్తున్నాడన్న ఉద్దేశ్యంతో భర్త మర్మాంగాలను కోసేసింది.
వివరాల్లోకి వెళితే, చందుళ్ళ పాడు ముప్పాళ్ళ గ్రామానికి చెందిన కోట ఆనంద్ బాబుకు గతంలో ఒకమ్మాయితో పెళ్ళయ్యింది. ఏవో కారణాల వల్ల వాళ్ళిద్దరూ విడిపోయారు.
ఆ తర్వాత వరమ్మను కోట ఆనంద్ బాబు రెండో వివాహం చేసుకున్నాడు. అయితే శుక్రవారం రాత్రి ఇంటికొచ్చిన ఆనంద్ బాబు ఇన్‌స్టాలో తన మొదటి భార్య పోస్ట్ చేసిన రీల్స్ చూస్తూ ఉన్నాడు.
దాంతో వరమ్మకు కోపం వచ్చి, ఎందుకు చూస్తున్నావని అడగడంతో ఇద్దరి మధ్య తగాదా మొదలైంది.
ఏపీ
వరమ్మపై కేసు నమోదు
ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి, చేయి చేసుకునే దాకా వచ్చింది. కోపంలో ఉన్న వరమ్మ, బ్లేడ్ తీసుకుని భర్త మర్మంగాలను గాయపరిచింది.
దాంతో తీవ్ర రక్తస్రావం జరగడంతో దగ్గర్లోని హాస్పిటల్ కు ఆనంద్ బాబును తరలించారు.
పరిస్థితి సీరియస్ గా ఉండడంతో విజయవాడ తీసుకెళ్ళమని వైద్యులు సూచించారట.
ప్రస్తుతం కోట ఆనంద్ బాబును విజయవాడ తీసుకెళ్ళినట్లు సమాచారం.
ఈ విషయమై పోలీసులకు సమాచారం అందివ్వడంతో వరమ్మ మీద కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేపట్టారు.