LOADING...
Strait of Hormuz: హర్మూజ్‌లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్‌తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!
హర్మూజ్‌లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్‌తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!

Strait of Hormuz: హర్మూజ్‌లో భారత నౌకల 'సీక్రెట్' జర్నీ.. ఇరాన్‌తో సంప్రదింపుల మధ్య సురక్షిత ప్రయాణం!

వ్రాసిన వారు Jayachandra Akuri
May 30, 2026
10:32 am

ఈ వార్తాకథనం ఏంటి

ప్రపంచ ఇంధన రవాణాకు అత్యంత కీలకమైన హర్మూజ్ జలసంధి (Strait of Hormuz)లో అంతరాయ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో భారత నౌకలు ప్రత్యేక భద్రతా చర్యల మధ్య తమ గమ్యస్థానాలకు చేరుతున్నాయి. హర్మూజ్ జలసంధి గుండా ప్రయాణిస్తున్న భారత నౌకల రాకపోకలను సురక్షితంగా నిర్వహించేందుకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ఇరాన్ అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతోందని షిప్పింగ్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

వివరాలు

నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలు

ఈ అంశానికి సంబంధించిన కీలక వివరాలను ఇటీవల నిర్వహించిన మంత్రిత్వ శాఖల అంతర్గత సమీక్ష సమావేశంలో పంచుకున్నట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం భారత జెండాతో ప్రయాణిస్తున్న 13 నౌకలు ఇంకా హర్మూజ్ ప్రాంతంలోనే ఉన్నాయని షిప్పింగ్ డైరెక్టర్ ఒపేశ్ కుమార్ శర్మ వెల్లడించారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, నౌకల సురక్షిత ప్రయాణానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.

Advertisement