
భారత నేర న్యాయ వ్యవస్థ ప్రక్షాళన దిశగా కేంద్రం.. 377 సెక్షన్ రద్దుకు ప్రతిపాదన
ఈ వార్తాకథనం ఏంటి
భారతదేశ నేర న్యాయ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళించేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది.
ఈ నేపథ్యంలో బ్రిటిష్ కాలం నాటి భారత శిక్షాస్మృతి (ఐపీసీ), క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్‌పీసీ), ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ (ఐఈఏ) చట్టాలకు స్వస్తి పలుకుతూ వాటి స్థానంలో కొత్త శాసనాలను తీసుకొచ్చేందుకు ముందడుగు పడింది.
ఈ మూడు చట్టాలను భర్తీ చేసేందుకు శుక్రవారం లోక్‌సభలో భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష్య బిల్లు 2023ను ప్రవేశపెట్టింది.
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు, ముఖ్యమంత్రులు, న్యాయ మంత్రిత్వ శాఖ, గవర్నర్‌లతో విస్తృత సంప్రదింపుల తర్వాత కేంద్రం ఈ బిల్లులను రూపొందించింది.
ఐపీసీ
ఐపీసీ సెక్షన్ 377 రద్దు చేయాలని ప్రతిపాదన
కేంద్ర ప్రభుత్వం రద్దు చేసేందుకు ప్రతిపాదించిన వాటిలో ఐపీసీ సెక్షన్ 377 కూడా ఉంది.
ప్రకృతికి విరుద్ధంగా ఎవరైనా పురుషుడు, స్త్రీ లేదా జంతువుతో శారీరక సంబంధం కలిగి ఉంటే ఈ సెక్షన్ ప్రకారం పదేళ్ల వరకు జైలు శిక్ష విధించబడుతుంది.
అలాగే జరిమానా కూడా విధిస్తారు. అయితే స్వలింగ సంపర్కం నేరం కాదని తీర్పు ఇచ్చిన నేపథ్యంలో మగవారు, ఆడవారు అసహజమైన లైంగిక నేరాలకు ఎలాంటి శిక్ష ఉండదు.
కేంద్రం సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో 377 సెక్షన్‌ను రద్దు చేయాలని నిర్ణయించింది. వాస్తవానికి మొదటి నుంచి స్వలింగ సంపర్కాన్ని కేంద్రం వ్యతిరేకిస్తోంది. ఈ క్రమంలోనే చట్టాన్ని సవరించేందుకు ముందుకొచ్చింది.
ఐపీసీ
మహిళలను మోసం చేస్తే 10ఏళ్ల జైలు శిక్ష
మహిళలపై నేరాలను అరికట్టేందుకు భారతీయ న్యాయ సంహిత(బీఎన్ఎస్) బిల్లును కేంద్రం ప్రతిపాదించింది.
ఈ బిల్లు ద్వారా వివాహం, పదోన్నతి, ఉద్యోగం అనే తప్పుడు వాగ్దానంతో గుర్తింపును దాచిపెట్టి, మహిళలతో లైంగిక సంబంధం పెట్టుకొని వివాహం చేసుకోవడాన్ని ఈ బిల్లు నేరంగా పరిగణిస్తుంది.
ఈ బిల్లు ప్రకారం నేరం రుజవైతే 10ఏళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. వ్యభిచారం నిబంధనల్లో కూడా మార్పులను కేంద్రం ప్రతిపాదించింది.
మహిళలపై నేరాలు, వారు ఎదుర్కొంటున్న అనేక సామాజిక సమస్యలను ఈ బిల్లులో ప్రస్తావించారు.
భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బిల్లు 9నిబంధనలను రద్దు చేయాలని సూచించింది.
భారతీయ సాక్షా బిల్లు ఐదింటిని రద్దు చేయాలని, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్‌లో ఒక కొత్త నిబంధనను ప్రవేశపెట్టాలని కేంద్రం కోరింది.