17వ తేదీ నుంచి 16కోచ్‌లతో సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్ పరుగులు; టైమింగ్స్ కూడా మార్పు
సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌కు అదనపు కోచ్‌లను చేర్చనున్నట్లు కేంద్రమంత్రి జి.కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రస్తుతం ఎనిమిది కోచ్‌లు ఉన్నాయి. అందులో ఏడు ఏసీ కోచ్‌లు, ఒక ఎగ్జిక్యూటివ్ కోచ్ ఉంటుంది. తిరుపతికి వెళ్లే వందే భారత్ రైలుకు రద్దీ భారీగా పెరగడంతో కోచ్ సంఖ్య పెంచాలని ప్రయాణికులు, యాత్రికులు నుంచి గతంలో కిషన్‌రెడ్డికి ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో బోగీల పెంపుపై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న కిషన్‌రెడ్డి రైల్వే అధికారులతో మాట్లాడారు. బోగీల పెంపునకు సంబంధించి సోమవారం కీలక అప్డేట్ ఇచ్చారు. మే 17నుంచి సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ 16కోచ్‌లతో పరుగులు పెడుతుందని స్పష్టం చేశారు.
వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు
ప్రయాణికుల నుంచి ఆసక్తి మేరకు 100శాతం ఆక్యుపెన్సీ కారణంగా బుధవారం నుంచి అదనంగా 8బోగీలను చేర్చి మొత్తం 16కోచ్‌లతో రైలు నడుస్తుందని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. ఈ విషయం చెప్పడానికి తాను సంతోషిస్తున్నట్లు వెల్లడించారు. సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళలలను కూడా అధికారులు మార్చేశారు. ఉదయం 6:15కి సికింద్రాబాద్ స్టేషన్ నుంచి బయలుదేరి అదే సమయంలో 14:30కి తిరుపతికి చేరుకుంటుందని చెప్పారు. తిరుగు ప్రయాణంలో తిరుపతి నుంచి 15:15 గంటలకు బయలుదేరి 23:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుందని వెల్లడించారు.