Delhi Airport: ఢిల్లీ విమానాశ్రయంలో గోడ దూకి రన్‌వేపైకి ప్రవేశించిన ఆగంతకుడు..హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
రిపబ్లిక్ డే వేడుకలు జరుగుతున్న వేళ దేశ రాజధాని దిల్లీలో హై అలర్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సమయంలో ఢిల్లీ విమానాశ్రయంలో భారీ భద్రతా వైఫల్యం చోటు చేసుకుంది. ఒక ఆగంతకుడు ఢిల్లీ విమానాశ్రయం ఎయిర్‌పోర్ట్ గోడ దూకి రన్‌వేపైకి చేరుకున్నాడని అధికారిక వర్గాలు ఆదివారం తెలిపాయి. "హైపర్‌సెన్సిటివ్" ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI)విమానాశ్రయాన్ని భద్రపరిచే బాధ్యత కలిగిన సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF),విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ఒక హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసింది. శనివారం రాత్రి 11:30 గంటల ప్రాంతంలో మద్యం మత్తులో ఉన్న చొరబాటుదారుడిని ఎయిర్ ఇండియా విమానం పైలట్ మొదట రన్‌వేపై గుర్తించినట్లు వారు తెలిపారు. పైలట్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్(ATC)కి సమాచారం అందించాడు.
హెడ్ కానిస్టేబుల్ సస్పెండ్
దింతో చొరబాటుదారుడిని వెంబడించాలని CISFని ఆదేశించింది.దీంతో సీఐఎస్‌ఎఫ్ (CISF) బలగాలు వెంటనే అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడు హర్యానా రాష్ట్రం నూహ్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు.అతడిని సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సిఐఎస్ఎఫ్) సిబ్బంది పట్టుకుని ఢిల్లీ పోలీసులకు అప్పగించినట్లు వారు తెలిపారు. "హైపర్‌సెన్సిటివ్" సివిల్ ఏవియేషన్ ఫెసిలిటీలో తీవ్రమైన భద్రతా ఉల్లంఘనపై పారామిలటరీ ఫోర్స్ విచారణ ప్రారంభించింది. ఆ రోజు డ్యూటీలో ఉన్న హెడ్ కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఆ వర్గాలు పిటిఐకి తెలిపాయి.
బీటింగ్ రిట్రీట్ తో ముగియనున్నగణతంత్ర దినోత్సవ వేడుకలు
విపరీతమైన చలి, పొగమంచు దృష్ట్యా విధ్వంసక కార్యకలాపాలను తనిఖీ చేయడానికి ప్రత్యేక చర్యలతో కొనసాగుతున్న రిపబ్లిక్ డే వేడుకల కోసం భద్రతా సంస్థలు హై-అలర్ట్ ప్రకటించిన సమయంలో "ఆందోళనకరమైన" సంఘటన జరిగిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. సోమవారం జరిగే బీటింగ్ రిట్రీట్ వేడుకతో గణతంత్ర దినోత్సవ వేడుకలు ముగుస్తాయి.