Loading...
Jammu Kashmir Terrorist: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్ చుట్టూ భద్రతా వలయం.. లొంగిపోవాలని వీడియోకాల్!
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్ చుట్టూ భద్రతా వలయం.. లొంగిపోవాలని వీడియోకాల్!

Jammu Kashmir Terrorist: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాది లతీఫ్ భట్ చుట్టూ భద్రతా వలయం.. లొంగిపోవాలని వీడియోకాల్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2026
08:50 am

ఈ వార్తాకథనం ఏంటి

జమ్ముకశ్మీర్ లో చిట్టచివరి స్థానిక ఉగ్రవాదిగా భావిస్తున్న లష్కరే తయ్యిబ (LeT) కమాండర్‌ లతీఫ్‌ భట్‌ను భారత భద్రతా దళాలు చుట్టుముట్టాయి. ఇటీవల సీఆర్పీఎఫ్‌ జవాన్లపై జరిగిన కాల్పుల ఘటన తర్వాత అతడి కోసం సైన్యం వేట ముమ్మరం చేసింది. ఈ క్రమంలో సోమవారం కుల్గాం జిల్లాలోని లారూ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో లతీఫ్‌ బుల్లెట్‌ గాయాలతో తప్పించుకున్నాడు. అదే ఎన్‌కౌంటర్‌లో ఉమర్‌ నసీర్‌ దార్‌ అనే మరో ఉగ్రవాదిని భద్రతా దళాలు మట్టుబెట్టాయి.

వివరాలు

వీడియోకాల్‌ చేసి లొంగిపోవాలని సూచన

లతీఫ్‌ భట్‌ కోసం సైన్యం, సీఆర్పీఎఫ్‌ బలగాలు గాలింపును మరింత తీవ్రం చేశాయి. మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అతడి ఆచూకీని గుర్తించిన భద్రతా దళాలు చుట్టుముట్టాయి.

ఈ క్రమంలో లతీఫ్‌కు అధికారులు వీడియోకాల్‌ చేశారు. లొంగిపోవాలని కోరడంతో పాటు, అతడికి ఎలాంటి హాని తలపెట్టబోమని నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.

అయితే భద్రతా దళాల విజ్ఞప్తిని లతీఫ్‌ తిరస్కరించాడు. దీంతో తెల్లవారుజామున ఇరువర్గాల మధ్య కాల్పులు తీవ్రరూపం దాల్చాయి.

వివరాలు

సీఆర్పీఎఫ్‌ దాడికి ముందు రెక్కీ

నవంబర్‌ 11న సీఆర్పీఎఫ్‌ దళాలపై దాడికి పాల్పడటానికి ముందు లతీఫ్‌ కుల్గాం ప్రాంతంలో పలుమార్లు రెక్కీ నిర్వహించినట్లు మంగళవారం వెలుగులోకి వచ్చిన సీసీటీవీ దృశ్యాల ద్వారా తెలిసింది.

నవంబర్‌ 10న అతడు స్థానిక మీర్‌ బజార్‌, అక్రాన్‌ హబ్లిస్‌, కిలామ్‌ ప్రాంతాల్లో సంచరించినట్లు భద్రతా వర్గాలు గుర్తించాయి.

లతీఫ్‌ భట్‌ గతంలో పలు హైప్రొఫైల్‌ ఉగ్రదాడుల్లో పాల్గొన్నట్లు సమాచారం.

అతడి ఆచూకీ తెలిపిన వారికి రూ.15 లక్షల రివార్డును కూడా ప్రకటించారు. ప్రస్తుతం అతడిని పట్టుకునేందుకు భద్రతా దళాలు ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి.

ADVERTISEMENT