RG Kar Case:'సెక్యూరిటీ లగ్జరీ కాదు': వైద్యుల నిరాహార దీక్షపై బెంగాల్ ప్రభుత్వానికి IMA లేఖ
కోల్‌కతాలోని ఆర్‌జీ ఖర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో జరిగిన మహిళా డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై నేటికీ దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ఈ ఘటనలో న్యాయం చేయాలని, పని ప్రదేశంలో భద్రతను కల్పించాలని డిమాండ్ చేస్తూ జూనియర్ డాక్టర్లు నిరసనకు దిగారు. గతవారం రోజులుగా డిమాండ్ల సాధన కోసం మరోసారి నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ క్రమంలో, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) సీఎం మమతా బెనర్జీకి లేఖ రాశారు. జూనియర్ వైద్యుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
యువ వైద్యుల డిమాండ్లపై తక్షణమే దృష్టి సారించాలి
యువ వైద్యులు నిరాహార దీక్షలు చేపట్టిన వారం అవుతున్న నేపథ్యంలో, డిమాండ్లపై తక్షణమే దృష్టి సారించాలని IMA సూచించింది. న్యాయమైన డిమాండ్లకు మద్దతిస్తున్నామని పేర్కొంది. ప్రభుత్వానికి అన్ని డిమాండ్లను నెరవేర్చగల సామర్థ్యం ఉన్నట్లు తెలిపింది. శాంతియుత వాతావరణం, భద్రత అవసరమని చెప్పారు. ప్రభుత్వానికోగా, యువతరం వైద్యుల సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం భారతదేశంలోని వైద్య వర్గాలు ఆందోళన చెందుతున్నాయని, మీరు (సీఎం) వారి ప్రాణాలను కాపాడగలరని వారు విశ్వసిస్తున్నారని తెలిపారు. ఏదైనా సహాయం చేయడానికి సంతోషంగా ఉంటామని IMA పేర్కొంది.