తదుపరి వార్తా కథనం

Tirumala: తిరుమలలో హై అలెర్ట్..భారత్-పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతల దృష్ట్యా భద్రత కట్టుదిట్టం
వ్రాసిన వారు
Sirish Praharaju
May 09, 2025
11:52 am
ఈ వార్తాకథనం ఏంటి
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో తిరుమలలో భద్రతను కట్టుదిట్టం చేశారు.
పోలీసులు అప్రమత్తమయ్యారు. భద్రతా చర్యలను సమీక్షించేందుకు జిల్లా పోలీసు అధికారి ఎస్పీ హర్షవర్ధన్ రాజు, జిల్లా ఉన్నతాధికారులతో కలిసి సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశం తిరుమలలోని సీవీఎస్‌వో కార్యాలయంలో జరిగింది.
భద్రతా పటిష్ఠతను మరింతగా పెంచుతూ, మధ్యాహ్నం నుంచి తిరుమలలో భద్రతా బలగాలు తనిఖీలు ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు
మీరు పూర్తి చేశారు