SEEI: ఇంధన పొదుపు సూచీలో టాప్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్ర ఇంధన పొదుపు సూచిక (ఎస్ఈఈఐ) 2021-22లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, రాజస్థాన్ ముందువరుసలో నిలిచినట్లు కేంద్రం తెలిపింది.
పైన పేర్కొన్న ఐదు రాష్ట్రాలు ఫ్రంట్-రన్నర్ విభాగంలో (60 పాయింట్లకు పైగా) ఉన్నట్లు ఇందులో ఆంధ్రప్రదేశ్ అధ్యధికంగా 77.5 పాయింట్లతో మొదటి స్థానంలో నిలిచినట్లు కేంద్రం వెల్లడించింది.
అలాగే అస్సాం, హర్యానా, మహారాష్ట్ర, పంజాబ్ రాష్ట్రాలు అచీవర్ విభాగంలో (50-60 పాయింట్లు) ఉన్నట్లు కేంద్రం పేర్కొన్నారు.
ఇంధనం
బీఈఈ, ఏఈఈఈ సంయుక్తంగా రూపొందించిన జాబితా
రాష్ట్ర ఇంధన పొదుపు సూచీలో ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ వృద్ధిని నమోదు చేసింది.
దిల్లీలో జరిగిన రాష్ట్రాలు, రాష్ట్ర ప్రయోజనాల ఆర్‌పీఎం(సమీక్ష, ప్రణాళిక, పర్యవేక్షణ) సమావేశంలో ఎస్ఈఈఐ నివేదికను విడుదల చేశారు.
ఇంధన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (బీఈఈ), అలయన్స్ ఫర్ ఎనర్జీ-ఎఫిషియెంట్ ఎకానమీ (ఏఈఈఈ)తో కలిసి ఈ జాబితాను రూపొందించారు.