Congress: కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యత ఏఐసీసీకి అప్పగింత
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించింది. ఈ క్రమంలో సీఎం అభ్యర్థిని ఎంపక చేసేందుకు సోమవారం సీఎల్పీ మీటింగ్ జరిగింది.
ఈ సమావేశంలో సీఎం అభ్యర్థి ఎంపిక బాధ్యతను ఏఐసీసీకి అప్పగిస్తూ తీర్మానించారు. ఈ మేరకు డీకే శివకుమార్ వెల్లడించారు.
అంతకుముందు, డీకే శివకుమార్ నేతృత్వంలోని ఏఐసీసీ పరిశీలకుల బృందం కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో మాట్లాడింది.
అలాగే ముఖ్య నాయకులైన భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
అంందరి అభిప్రాయం తీసుకున్న ఏఐసీసీ బృందం.. సీఎం ఎంపిక బాధ్యతను కేంద్ర నాయకత్వానికి అప్పగించింది.
ఈ రోజే.. ఏఐసీసీ కూడా తన నిర్ణయాన్ని వెల్లడించే అవకాశం ఉంది. దీంతో సీఎం ప్రమాణ స్వీకారం కూడా ఈ రోజే ఉంటుందని తెలుస్తోంది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ముగిసిన సీఎల్పీ సమావేశం
*⃣ముగిసిన కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం.
— AIR News Hyderabad (@airnews_hyd) December 4, 2023
*⃣గచ్చిబౌలిలోని ఓ హోటల్‌లో ఆ పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశమైన ఏఐసీసీ పరిశీలకులు.
*⃣సీఎల్పీ నేత ఎంపికకు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకున్నఏఐసీసీ.
*⃣సీఎం ఎంపిక బాధ్యతను అధిష్ఠానానికి అప్పగిస్తూ ఏకవాక్య తీర్మానం. #Congress pic.twitter.com/3Pe78DcLb0