ఆంధ్రప్రదేశ్‌లో బీఆర్ఎస్ విస్తరణపై కేసీఆర్ ఫోకస్.. పార్టీ అధ్యక్ష బాధ్యతలు ఆయనకేనా?
ఆంధ్రప్రదేశ్‌లో భారత రాష్ట్ర సమితి విస్తరణపై అధినేత కేసీఆర్ దృష్టి పెట్టారు. వీలైనంత త్వరలో ఏపీలో పార్టీ కార్యాలయాలన్ని ప్రారంభించాలనే ఆలోచనలో ఉన్నారు. ఏపీలో పార్టీని నడిపే నాయకుల జాబితాను ఇప్పటికే ఖరారు చేశారట. కీలక నాయకుల పేర్లు ఇప్పడు బయటకు వచ్చాయి. వీరందరూ సోమవారం కేసీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. బీఆర్ఎస్‌లో చేరేవారిలో ముఖ్యంగా ముగ్గురి పేర్లు వినిపిస్తున్నాయి. అందులో ఒకరు మాజీ మంత్రి రావెల కిషోర్‍బాబు కాగా.. మరొకరు రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి.. ఇంకొకరు తోట చంద్రశేఖర్. టీజే ప్రకాశ్ కూడా బీఆర్ఎస్‌లో చేరనున్నారట. ఏపీలో పార్టీ అధ్యక్ష బాధ్యతలను మాజీ ఐఏఎస్ అధికారి తోట చంద్రశేఖర్‌కు అప్పగించనున్నట్లు ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం
తోట చంద్రశేఖర్, పార్థసారథి, కిషోర్‍బాబుకు రాజకీయ అనుభవంతో పాటు రాష్ట్ర, కేంద్ర సర్వీసుల్లో పనిచేసిన అనుభవం కూడా ఉంది. ఈ క్రమంలో వీరు ఏపీలో పార్టీని వ్యూహాత్మకంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్లు సమాచారం. మాజీ ఐఆర్ఎస్ అధికారి కోవెల కిషోర్‍బాబు.. 2014లో టీడీపీలో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది.. చంద్రబాబు మంత్రవర్గంలో పనిచేశారు. కొంతకాలంగా ఆయన రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. ఐఏఎస్ అధికారిగా ఉండి స్వచ్ఛంద పదవీవిరమణ పొంది.. ప్రజారాజ్యం ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు. 2009లో గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ, 2019లో జనసేన తరఫున పోటీ చేసి పరాజయం పాలయ్యారు. మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారధి 2019లో జనసేన ద్వారా రాజకీయాల్లో ప్రవేశించారు.