LOADING...
Bengaluru: బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!
బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!

Bengaluru: బెంగళూరులో సంచలనం.. నర్సింగ్ విద్యార్థినిపై పీజీ యజమాని అఘాయిత్యం!

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 03, 2025
05:29 pm

ఈ వార్తాకథనం ఏంటి

బెంగళూరులో పీజీ యజమాని చేతిలో విద్యార్థిని లైంగిక దాడికి గురైన ఘటన కలకలం రేపుతోంది. పేయింగ్ గెస్ట్‌గా నివసిస్తున్న విద్యార్థినిపై అష్రఫ్ అనే యజమాని అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం..10రోజుల క్రితమే ఆమె అష్రఫ్‌కు చెందిన ప్రాపర్టీలో పీజీగా ప్రవేశించింది. ఘటన సోమవారం రాత్రి చోటుచేసుకుంది. అష్రఫ్ ఆ విద్యార్థిని గదిలోకి వచ్చి, తనకు సహకరిస్తే భోజనం, వసతి కల్పిస్తానని చెప్పాడు. ఆమె తిరస్కరించగా, బలవంతంగా కారులో ఎక్కించి, ఒక గదికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ఘటనలో బాధితురాలు తన లొకేషన్‌ను స్నేహితులకు పంపే ప్రయత్నం చేసినా విఫలమైందని తెలిపింది.

Details

నిందితులపై కఠిన చర్యలు తీసుకునేందుకు చర్యలు

తెల్లవారుజామున 1.30 నుంచి 2.15 గంటల మధ్య అష్రఫ్ తనను తిరిగి పీజీకి తీసుకెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. ఇది మొదటిసారి కాదు. నెల రోజుల క్రితం బెంగళూరులో మరో పీజీలో కూడా ఇదే తరహా ఘటన జరిగింది. రవితేజ రెడ్డి అనే యజమాని, 21 ఏళ్ల నర్సింగ్ విద్యార్థినిపై అత్యాచారం చేశాడని ఆరోపణలొచ్చాయి. అయితే ఆ విద్యార్థిని, పీజీలోని మరో యువతికి చెందిన మూడు బంగారు ఉంగరాలను దొంగిలించిందని, పోలీసులు కేసు నమోదు చేయకుండా చూడాలని కోరిన సందర్భంలో తనపై అత్యాచారం జరిగిందని ఆరోపించింది. ఈ రెండు ఘటనలతో విద్యార్థుల భద్రతపై అనేక ప్రశ్నలు నెలకొన్నాయి. పోలీసులు దర్యాప్తు ప్రారంభించగా, నిందితులపై కఠిన చర్యలు తీసుకునే దిశగా చర్యలు కొనసాగుతున్నాయి.