MK. Stalin: తమిళనాడు రాజకీయాల్లో సంచలనం.. సీఎం ఎం.కే. స్టాలిన్ ఓటమి
వ్రాసిన వారు
Jayachandra Akuri
May 04, 2026
04:59 pm
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో సంచలన ఫలితం వెలుగుచూసింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ కొళత్తూర్ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. అక్కడి నుంచి పోటీ చేసిన ఆయనను టీవీకే అభ్యర్థి వీఎస్ బాబు సుమారు 9 వేల ఓట్ల తేడాతో ఓడించారు. కొళత్తూర్ నుంచి వరుసగా మూడు సార్లు విజయం సాధించిన స్టాలిన్ ఈసారి గెలవలేకపోవడం గమనార్హం. 1996 తర్వాత ఆయనకు ఇది తొలి ఓటమిగా నమోదైంది. ఇక ఎన్నికల ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ అంచనాలను పూర్తిగా తారుమారు చేశాయి. టీవీకే పార్టీ అనూహ్యంగా గెలుపు దిశగా దూసుకుపోతోంది. మరోవైపు, స్టాలిన్ తనయుడు ఉదయనిధి స్టాలిన్ మాత్రం తన నియోజకవర్గంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.