Page Loader
Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్ 
Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్

Kesineni Swetha: టీడీపీ అధిష్టానంపై కేశినేని శ్వేత సంచలన కామెంట్స్ 

వ్రాసిన వారు Stalin
Jan 08, 2024
03:08 pm

ఈ వార్తాకథనం ఏంటి

విజయవాడ కార్పొరేటర్ పదవికి ఎంపీ కేశినేని నాని కూతురు శ్వేత రాజీనామా చేశారు. రాజీనామా తర్వాత శ్వేత మీడియాతో మాట్లాడారు. తమ కుటుంబం టీడీపీకి రాజీనామా చేస్తామని ఊహించలేదన్నారు. టీడీపీ అధినేత తమను వద్దనుకున్నారుని వాపోయారు. కేశినేని నానిని టీడీపీ కార్యక్రమాల్లో జోక్యం చేసుకోవద్దని చెప్పారని, అందుకే ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినట్లు శ్వేత వివరించారు. టీడీపీ అధ్యక్షుడు నందిగామ కానీ, విజయవాడకు కానీ వచ్చినా.. కేశినేని నానికి కనీసం పిలవకకుండా, సిట్టింగ్ ఎంపీని అగౌరవపర్చారన్నారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో తప్పకుండా కేశినేని నాని ఎంపీగా పోటీ చేయనున్నట్లు శ్వేత వెల్లడించారు. అయితే ఎలా పోటీ చేయడం అనేది అనుచరులు, అభిమానులతో కలిసి చర్చించిన తర్వాత ప్రకటిస్తామన్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

మీడియాలో మాట్లాడుతున్న శ్వేత