Kurnool bus accident:కర్నూలు బస్సు ప్రమాద మిస్టరీ వీడింది.. దర్యాప్తులో కీలక విషయాలు
ఈ వార్తాకథనం ఏంటి
తెలుగు రాష్ట్రాల్లో తీవ్రమైన విషాదాన్ని నింపిన కర్నూలు బస్సు ప్రమాదం మిస్టరీపై కీలక విషయాలు వెల్లడయ్యాయి. వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో మంటలు చెలరేగి 19 మంది ప్రాణాలు కోల్పోయిన ఘటన తెలిసిందే. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న శివశంకర్ కూడా మృతి చెందాడు. పోలీసుల దర్యాప్తులో, బైక్‌పై శివశంకర్ వెనుక కూర్చున్న వ్యక్తిని ఎర్రిస్వామి (అలియాస్ నాని) గా గుర్తించారు. అతన్ని పలు కోణాల్లో విచారించి కీలక ఆధారాలు సేకరించారు. కేసు వివరాలను కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మీడియాకు వెల్లడించారు.
Details
కీలక విషయాలు ఇవే!
శివశంకర్ మరియు వెనుక కూర్చున్న ఎర్రిస్వామి లక్ష్మీపురం గ్రామం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయంలో తుగ్గలికి బయలుదేరారు. మార్గమధ్యలో అర్ధరాత్రి 2.24 గంటలకు కియాషోరూమ్ సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద రూ.300 పెట్రోల్ తీసుకున్నారు. కొద్ది సేపటికే **చిన్నటేకూరు సమీపంలో శివశంకర్ బైక్ నడుపుతూ స్కిడ్ అయ్యి రోడ్డుకు కుడివైపు ఉన్న డివైడర్‌ను ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్‌పై వెనుక కూర్చున్న ఎర్రిస్వామి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. శివశంకర్‌ను పక్కకు తరలించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, వేగంగా వచ్చిన బస్సు బైక్‌ను ఢీకొని కొద్ది దూరం ఈడ్చింది. బస్సు కింద మంటలు వచ్చడంతో ఎర్రిస్వామి భయపడి తన స్వగ్రామం తుగ్గలికు వెళ్లి పోయాడు.