LOADING...
Andhra Pradesh: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత వరుస ఆపరేషన్స్‌… ఏపీలో మరో 31 మంది మావోయిస్టుల పట్టివేత
మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత వరుస ఆపరేషన్స్‌… ఏపీలో మరో 31 మంది మావోయిస్టుల పట్టివేత

Andhra Pradesh: మారేడుమిల్లి ఎన్‌కౌంటర్‌ తర్వాత వరుస ఆపరేషన్స్‌… ఏపీలో మరో 31 మంది మావోయిస్టుల పట్టివేత

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 18, 2025
03:13 pm

ఈ వార్తాకథనం ఏంటి

అల్లూరి సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ ఏడీజీ మహేశ్‌చంద్ర లడ్డా తెలిపారు. మంగళవారం ఉదయం 6.30 నుంచి 7.00 గంటల మధ్య భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య తీవ్ర ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయని ఆయన వివరించారు. జిల్లా ఎస్పీ అమిత్‌ బర్దార్‌తో కలిసి జరిగిన మీడియా సమావేశంలో ఎన్‌కౌంటర్ వివరాలను వెల్లడించారు. రెండు రోజులుగా ఇంటెలిజెన్స్‌ సమాచారాన్ని ఆధారంగా తీసుకుని విస్తృత స్థాయిలో గాలింపు చర్యలను చేపట్టామని ఏడీజీ తెలిపారు. ప్రస్తుతం కూంబింగ్‌ ఆపరేషన్ కొనసాగుతోందని, కాల్పుల ప్రాంతం నుంచి మావోయిస్టుల వద్ద ఉన్న పలు రకాల ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

Details

31 మంది మావోయిస్టుల అరెస్ట్ 

మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌లో కృష్ణా జిల్లా, విజయవాడ, కాకినాడ ప్రాంతాల్లో మొత్తం 31 మంది మావోయిస్టులను అరెస్ట్ చేసినట్లు ఏడీజీ లడ్డా వెల్లడించారు. వీరిలో తొమ్మిది మంది కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారని తెలిపారు.

Details

స్వాధీనం చేసిన ఆయుధాలు, పేలుడు పదార్థాల వివరాలు

ఏకే-47 తుపాకులు - 2 పిస్టల్ - 1 రివాల్వర్ - 1 సింగిల్ బోర్ ఆయుధం - 1 ఎలక్ట్రికల్ డిటోనేటర్లు - 1525 నాన్ ఎలక్ట్రికల్ డిటోనేటర్లు - 150 ఎలక్ట్రికల్ వైర్ బండిల్ - 1 కెమెరా ఫ్లాష్ లైట్ - 1 కటింగ్ బ్లేడ్ - 1 ఫ్యూజ్ వైర్ - 25 మీటర్లు కిట్ బ్యాగులు - 7 భద్రతా బలగాలు ప్రాంతంలో కూంబింగ్‌ ముమ్మరం చేసినట్లు అధికారులు వెల్లడించారు.