Page Loader
Nirmala Sitharaman: 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం.. నిర్మలా సీతారామన్ ప్రణాళికలు
2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం.. నిర్మలా సీతారామన్ ప్రణాళికలు

Nirmala Sitharaman: 2024-25 బడ్జెట్‌కు రంగం సిద్ధం.. నిర్మలా సీతారామన్ ప్రణాళికలు

వ్రాసిన వారు Jayachandra Akuri
Nov 12, 2024
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సర బడ్జెట్ (కేంద్ర బడ్జెట్) కోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 21-22 తేదీల్లో రాజస్థాన్‌లో రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశం ద్వారా రాష్ట్రాలు తమ సూచనలు ఇవ్వనున్నాయి. అలాగే కేంద్ర బడ్జెట్‌లో వాటిని పరిగణనలోకి తీసుకోనుంది. ఫిబ్రవరి 1న ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఇక 55వ జీఎస్టీ కౌన్సిల్ సమావేశం కూడా డిసెంబర్‌లోనే జరగనుంది. రాష్ట్రాల మధ్య తాజా చర్చలతో పాటు, జీఎస్టీ కౌన్సిల్‌లో జీవిత, ఆరోగ్య బీమా ప్రీమియం పైన జీఎస్టీ రద్దు లేదా తగ్గింపు కోసం డిమాండ్లు పెరుగుతున్నాయి.

Details

బడ్జెట్‌కు ముందస్తు సన్నాహాలు

సెప్టెంబర్‌లో జరిగిన గత కౌన్సిల్ సమావేశంలో దీని మీద ఓ నిర్ణయం తీసుకుంటారని భావించారు. అయితే దీనిపై మంత్రుల బృందానికి మరింత హేతుబద్ధమైన నివేదిక రూపొందించే బాధ్యత అప్పగించారు. జీఎస్టీ రేట్లను సవరించడానికి ఏర్పాటైన ఈ మంత్రుల బృందాన్ని బిహార్ డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి నాయకత్వంలో కొనసాగిస్తున్నారు. కొత్త సభ్యులు కూడా ఈ బృందంలో చేరతారని, అక్టోబర్ చివరి నాటికి నివేదిక సమర్పిస్తారని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.