Cyclone Control Rooms: మొంథా తుపాను.. అన్ని మున్సిపాలిటీల్లో కంట్రోల్ రూమ్‌లు: మంత్రి నారాయణ
ఈ వార్తాకథనం ఏంటి
మొంథా తుపాను సమీపిస్తున్న నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మున్సిపల్ కమిషనర్లతో ఆంధ్రప్రదేశ్ మంత్రి నారాయణ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుపాను ప్రభావాన్ని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు జారీ చేశారు. మంత్రి నారాయణ మాట్లాడుతూ.."తుపాను పరిస్థితిపై అధికారులు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ఎలాంటి అత్యవసర పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలు సిద్ధంగా ఉంచాలి. అన్ని మున్సిపాలిటీలలో కంట్రోల్ రూమ్‌లను ఏర్పాటు చేసి, ప్రజలకు సమయానుకూలంగా సమాచారం అందించే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి. తుపాను ప్రభావంతో రోడ్లపై చెట్లు కూలినట్లయితే, వెంటనే తొలగించే చర్యలు తీసుకోవాలి. పునరావాస శిబిరాల వివరాలను నిరంతరం ప్రజలకు తెలియజేయాలి. తాగునీటి సరఫరాలో అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలి,"అని మంత్రి దిశానిర్దేశం చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రల్ రూమ్ నెంబర్లు
తుపాను నేపధ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభావం చూపే కోస్తా జిల్లాల్లో ఏర్పాటు చేసిన కంట్రల్ రూమ్ నెంబర్లు
— I & PR Andhra Pradesh (@IPR_AP) October 26, 2025
విపత్తుల నిర్వహణ సంస్థలోని స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 1800 425 0101 pic.twitter.com/4CBxh6mSBi