LOADING...
High speed rail corridors: బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!
బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!

High speed rail corridors: బడ్జెట్‌లో ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లు.. లిస్టులో హైదరాబాద్!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 01, 2026
12:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

వార్షిక కేంద్ర బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలను అనుసంధానిస్తూ ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా ముంబయి-పుణె, పుణె-హైదరాబాద్‌, హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-చెన్నై, దిల్లీ-వారణాసి, వారణాసి-సిలిగుడి, చెన్నై-బెంగళూరు మధ్య మొత్తం ఏడు హైస్పీడ్ రైల్ కారిడార్లను ప్రతిపాదించారు. మౌలిక సదుపాయాల కల్పనకు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.12.2 లక్షల కోట్లను కేటాయిస్తున్నట్టు మంత్రి తెలిపారు.

Details

ఈసారి స్వల్పంగా పెరుగుదల

గతేడాది ఈ రంగానికి రూ.11.2 లక్షల కోట్లు కేటాయించగా, ఈసారి స్వల్పంగా పెంచినట్టు పేర్కొన్నారు. దేశ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై ప్రసంగిస్తూ, ఈ హైస్పీడ్ రైల్ కారిడార్ల ద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం మరింత బలోపేతం అవుతుందని నిర్మలా సీతారామన్ తెలిపారు. సుదూర ప్రయాణాలకు ఇవి పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా మారనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఈ కారిడార్లు ప్రయాణ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తాయని, రోడ్డు మార్గాలతో పాటు ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌పై ఉన్న రద్దీని కూడా తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement