
Uttar Pradesh: ఐదుగురు చిన్నారుల ప్రాణాలు తీసిన బొగ్గుల కుంపటి
ఈ వార్తాకథనం ఏంటి
ఇంట్లో నిద్రిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఊపిరాడక మృతి చెందారు. పరిస్థితి విషమంగా ఉన్న మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించారు.
ఉత్తర్‌ప్రదేశ్ లోని అమ్రోహా జిల్లాలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. అమ్రోహా జిల్లాకు చెందిన రహీజుద్దీన్ కుటుంబంలోని లోని ఏడుగురు సోమవారం రాత్రి పడుకునే ముందు బొగ్గుల కుంపటిని ఏర్పాటు చేసుకున్నారు.
ఇంటి తలుపులు, కిటీకీలు మూసివేయడంతో కాసేపటికి కుంపటి నుంచి దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక ఐదుగురు చిన్నారులు మృతి చెందారు.
Details
భార్య, సోదరుడి పరిస్థితి విషమం
మంగళవారం సాయంత్రం వరకు తలుపులు తీయకపోవడంతో ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది.
తలుపులు పగులగొట్టి బలవంతంగా ఇంట్లోకి ప్రవేశించారు.
ఈ ప్రమాదంలో రహీజుద్దీన్ ముగ్గురు పిల్లలు, అతని బంధువుల ఇద్దరు పిల్లలు మరణించారు.
అతని భార్య, సోదరుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
పోలీసు సూపరింటెండెంట్ కున్వర్ అనుపమ్ సింగ్‌తో సహా భారీ పోలీసు బలగాలు, పరిపాలనా అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.