Page Loader
హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు
హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు

హిమాచల్ ప్రదేశ్‌: భారీ వర్షాలకు ఏడుగురు మృతి, విద్యా సంస్థలకు సెలవు

వ్రాసిన వారు Stalin
Aug 14, 2023
10:38 am

ఈ వార్తాకథనం ఏంటి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు మరోసారి బీభత్సం సృష్టిస్తున్నాయి. రాష్ట్రంలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. సోలన్ జిల్లాలోని కందఘాట్ సబ్‌డివిజన్‌లోని మామ్లిగ్ ఉప-తహసీల్‌లోని జాడోన్ గ్రామంలో భారీ వర్షాల కారణంగా రెండు ఇళ్లు కొట్టుకుపోయాయి. ఇందులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. మృతి చెందిన వారిలో ఇప్పటి వరకు నాలుగు మృతదేహాలు లభ్యం కాగా, మిగతా వాటికోసం గాలిస్తున్నారు. రాష్ట్రంలోని చాలా చోట్ల కొండచరియలు విరిగిపడి రహదారులు మూసుకుపోయాయి. కీలకమైన సిమ్లా-చండీగఢ్ రహదారితో సహా పలు పలు రోడ్లపై రాకపోకలు స్తంభించిపోయాయి.

హిమాచల్

621 రహదారులపై నిలిచిపోయిన రాకపోకలు

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల దృష్ట్యా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, కళాశాలలను ఆగస్టు 14న మూసివేస్తున్నట్లు ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు తెలిపారు. కొండచరియలు, విరిగిపడటంతో పాటు వర్షాలకు రోడ్లు కొట్టుకుపోవడంతో మండిలో గరిష్టంగా 236, సిమ్లాలో 59, బిలాస్‌పూర్ జిల్లాలో 40తో సహా మొత్తం 621 రహదారులపై ప్రస్తుతం రాకపోకలు నిలిచిపోయినట్లు రాష్ట్ర అత్యవసర ఆపరేషన్ కేంద్రం చెప్పింది. సోలన్‌లోని కందఘాట్ సబ్‌డివిజన్‌లోని మామ్లిగ్ గ్రామంలో వరదల్లో చిక్కుకున్న ఆరుగురిని రక్షించినట్లు వారు తెలిపారు. భారీ వర్షాలపై ముఖ్యమంత్రి సుఖ్‌విందర్ సింగ్ సుఖు ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఈ మేరకు మృతుల కుటుంబాల పట్ల సానుభూతిని ప్రకటించారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

హిమాచల్ ప్రదేశ్ సీఎం చేసిన ట్వీట్