Delhi: దిల్లీలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో బుధవారం భారీ ప్రమాదం చోటుచేసుకుంది.ఈశాన్య ఢిల్లీలోని సీమాపురి ప్రాంతంలో ఓ ఐదంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. మధ్యాహ్నం సుమారు 3:30 గంటల సమయంలో భవనం కూలినట్లు సమాచారం అందిందని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం శిథిలాలను తొలగించే ప్రక్రియ ముమ్మరంగా కొనసాగుతోంది. ఫైర్ సర్వీస్ సిబ్బందితో పాటు స్థానికులు కూడా సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద ఎవరైనా చిక్కుకుని ఉంటే వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.
వివరాలు
ప్రజలకు కీలక సూచనలు చేసిన ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు
ఈ క్రమంలో కొందరు స్థానికులు కాంక్రీట్ పెళ్లలను చేతులతో తొలగించేందుకు ప్రయత్నిస్తుండగా.. మరికొందరు ఘటనకు సంబంధించిన దృశ్యాలను తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు.
భవనం కూలిన ఘటన నేపథ్యంలో ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు కీలక సూచనలు చేశారు.
సహాయక చర్యలకు ఎలాంటి ఆటంకం కలగకుండా, అంబులెన్సులు, ఇతర సహాయక వాహనాలు వేగంగా ఘటనాస్థలికి చేరుకునేలా సీమాపురి గోల్ చక్కర్, డీఎల్ఎఫ్ భోపురా పరిసర ప్రాంతాలకు ప్రజలు రావొద్దని 'ఎక్స్' వేదికగా విజ్ఞప్తి చేశారు.
ఇటీవలే సత్యనికేతన్ ప్రాంతంలో ఓ హాస్టల్ భవనం కూలి ఏడుగురు మృతి చెందిన ఘటనను ఢిల్లీ వాసులు మరువకముందే మరో భవనం కుప్పకూలడం ఆందోళన కలిగిస్తోంది.
వరుసగా భవనాలు కూలిపోతున్న ఘటనలు నగరవాసుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు చేసిన ట్వీట్
🚨 TRAFFIC ALERT | SEEMAPURI
— Delhi Traffic Police (@dtptraffic) October 7, 2026
A multi story building has collapsed in Seemapuri and rescue teams are working at the site. Traffic is affected around Seemapuri Gol Chakkar, DLF Bhopura and adjoining roads.
Every clear lane gives an ambulance and rescue vehicle a faster way…
ట్విట్టర్ పోస్ట్ చేయండి
సీమాపురిలో కుప్పకూలిన ఐదంతస్తుల భవనం
#WATCH | Delhi: A residential building collapsed near Idgah Machhli Mandi, New Seemapuri, this afternoon. Visuals from the spot. More details awaited. pic.twitter.com/jNJcq8xisT
— ANI (@ANI) October 7, 2026