Page Loader
Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు 
Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు

Agra: పొగమంచు కారణంగా..ఆరు కార్లు ఢీ.. ఒకరు మృతి..పలువురికి గాయాలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Dec 27, 2023
09:40 am

ఈ వార్తాకథనం ఏంటి

ఉత్తర్‌ప్రదేశ్ లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది.ఆగ్రా-లక్నోఎక్స్‌ప్రెస్‌వేపై దట్టమైన పొగమంచు కారణంగా ఉన్నావ్ సమీపంలో బుధవారం ఉదయం ఆరు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందగా,కనీసం 24 మంది గాయపడ్డారని ఉత్తరప్రదేశ్‌ పోలీసులు తెలిపారు. ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో డబుల్ డెక్కర్ బస్సు దృశ్యమానత సరిగా లేక అదుపు తప్పి సెంట్రల్ డివైడర్‌ను ఢీకొట్టింది. ఈప్రమాదం వల్ల వెనుక వస్తున్న ఇతర వాహనాలు ఒక దాని ఒకటి ఢీ కొన్నాయి. బస్సులోని ఓ ప్రయాణికుడు తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు.మరో 24 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా,వారిని ప్రాథమిక చికిత్స కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్న ఆరుగురిని లక్నోలోని ట్రామా సెంటర్‌కు తరలించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ఆగ్రా-లక్నోఎక్స్‌ప్రెస్‌వేపై ఘోర రోడ్డు ప్రమాదం