Page Loader
Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత
దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత

Delhi Schools Closed: దిల్లీలో పీక్‌లో వాయి కాలుష్యం.. నవంబర్ 10 వరకు ప్రైమరీ స్కూళ్ల మూసివేత

వ్రాసిన వారు Stalin
Nov 05, 2023
11:09 am

ఈ వార్తాకథనం ఏంటి

దిల్లీలో వాయి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో దిల్లీలో కేజ్రీవాల్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. నవంబర్ 10 వరకు ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ఆదివారం తెలిపారు. అలాగే ఈ సమయంలో పాఠశాలలు 6 నుంచి 12 తరగతులకు ఆన్‌లైన్ తరగతులకు నిర్వహించుకోవాలని దిల్లీ ప్రభుత్వం సూచించింది. విద్యాశాఖ మంత్రి అతిషి మాట్లాడుతూ.. దిల్లీలో వాయు కాలుష్యం ఆరోగ్యపరంగా అత్యధిక స్థాయికి చేరుకుందని అన్నారు. ఇది పిల్లలకు చాలా హానికరమన్నారు. పిల్లల ఆరోగ్యం దృష్ట్యా దిల్లీ ప్రాథమిక పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషి ట్వీట్