LOADING...
Telangana: తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు.. వాతావరణ శాఖ అంచనా ఇదే..
తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు.. వాతావరణ శాఖ అంచనా ఇదే..

Telangana: తెలంగాణను వణికిస్తున్న చలిగాలులు.. వాతావరణ శాఖ అంచనా ఇదే..

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 16, 2025
05:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణలో చలి తీవ్రత రోజు రోజుకు పెరుగుతూ పోతోంది. రాత్రివేళల ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో అనేక జిల్లాలలో చలిగాలులు బలంగా వీచుతున్నాయి. దీంతో ప్రజలు గడ్డకట్టేంత చలిని ఎదుర్కొంటూ వణుకుతున్నారు. ఇంకా వచ్చే రెండు మూడు రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే 3 నుంచి 4 డిగ్రీలు వరకు మరింత తగ్గే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రాష్ట్రవ్యాప్తంగా పొడి వాతావరణమే కొనసాగుతుందని, ప్రస్తుతం ఎలాంటి ప్రత్యేక హెచ్చరికలు లేవని స్పష్టం చేసింది.

వివరాలు 

సిర్పూర్‌లో 7.4 డిగ్రీలు

తెలంగాణ వెదర్‌మ్యాన్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్‌లో 7.4 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 8.1 డిగ్రీలు నమోదు కాగా, హైదరాబాద్ హెచ్‌సీయూ పరిసరాల్లో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత రికార్డైంది. రాబోయే రాత్రులలో ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గే సూచనలు ఉన్నాయని తెలిపారు. చలి పెరిగిన నేపథ్యంలో ప్రజలు ఇళ్ల ఎదుట మంటలు వేసుకొని వేడెక్కిస్తున్నారు. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి నెలల్లో చలి మరింత తీవ్రం కావచ్చని అంచనా. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

తెలంగాణ వెదర్‌మ్యాన్ చేసిన ట్వీట్