Cyclone Akvan: అక్వాన్ తుపాను తీరం దాటే ప్రక్రియ షురూ.. ఉత్తరాంధ్రకు వర్ష సూచన
ఈ వార్తాకథనం ఏంటి
బంగాళాఖాతంలో ఏర్పడిన 'అక్వాన్' తీవ్ర తుపాను తీరం దాటడం ప్రారంభించినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. మరో మూడు గంటల్లో తుపాను పూర్తిగా తీరాన్ని దాటే అవకాశం ఉందని తెలిపింది. గత ఆరు గంటల్లో గంటకు 21 కిలోమీటర్ల వేగంతో తుపాను కదిలినట్లు పేర్కొంది. శ్రీకాకుళం జిల్లా గోపాల్‌పూర్ సమీపంలో తుపాను పూర్తిగా తీరం దాటే అవకాశముందని అంచనా వేసింది. శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు తుపాను ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. మిగిలిన ఉత్తరాంధ్ర జిల్లాల్లోనూ మోస్తరు వర్షాలు పడవచ్చని వెల్లడించింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది.
వివరాలు
ఇచ్ఛాపురంలో అత్యధిక వర్షపాతం
తుపాను ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి.
ఇచ్ఛాపురంలో అత్యధికంగా 16 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. కంచిలి, కవిటిలో 10 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది.
సోంపేటలో 9.2 సెంటీమీటర్లు, పలాసలో 9.9 సెంటీమీటర్లు, వజ్రపుకొత్తూరులో 4.9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.