LOADING...
Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

Cyclone Alert: నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం: రాబోయే మూడు రోజులు భారీ వర్షాలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 27, 2025
11:27 am

ఈ వార్తాకథనం ఏంటి

నైరుతి బంగాళాఖాతం,దానికి సమీపంలోని శ్రీలంక తీరప్రాంతంలో ఏర్పడిన వాయుగుండం ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా మారిపోయిందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. ఈ వ్యవస్థ ఉత్తర-వాయవ్య దిశలో ప్రయాణిస్తూ, వచ్చే 12 గంటల్లో తుపానుగా మారే అవకాశముందని అధికారులు తెలిపారు. అనంతరం, తదుపరి 48 గంటల్లో.. అంటే 29వ తేదీ సాయంత్రం లేదా 30వ తేదీ ఉదయం నాటికి.. ఇది నైరుతి బంగాళాఖాతం, శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి,దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతాల వైపు కదులుతుందని అంచనా వేశారు.

వివరాలు 

ఈ ప్రాంతాలలో  భారీ నుండి అతిభారీ వర్షాలు 

ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో శనివారం, ఆదివారం, సోమవారం రోజుల్లో దక్షిణ కోస్తా ఆంధ్ర ప్రాంతం,రాయలసీమలో కొన్ని చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ముఖ్యంగా శనివారం, ఆదివారాల్లో చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం, వైఎస్ఆర్ కడప, అన్నమయ్య, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని సూచించింది. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరించారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచించారు.