Page Loader
Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!
టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

Palla Simhachalam: టీడీపీలో విషాదఛాయలు.. మాజీ ఎమ్మెల్యే కన్నుమూత!

వ్రాసిన వారు Jayachandra Akuri
Jun 07, 2025
03:30 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీడీపీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ తండ్రి, మాజీ ఎమ్మెల్యే పల్లా సింహాచలం (93) శనివారం ఉదయం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం క్షీణించడంతో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనతో టీడీపీ శ్రేణులు దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయన మరణం పార్టీకి తీరనిలోటుగా అభివర్ణిస్తున్నారు. 1994లో విశాఖపట్టణం- 2అసెంబ్లీ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున విజయం సాధించిన పల్లా సింహాచలం, నియోజకవర్గ అభివృద్ధికి విశేషంగా కృషి చేసిన నేతగా గుర్తింపు పొందారు.

Details

సంతాపం తెలిపిన సీఎం చంద్రబాబు నాయుడు

స్థానిక సమస్యల పరిష్కారానికి నిరంతరం పాటుపడిన ఆయన సేవలు మరవలేనివని పలువురు నేతలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో పల్లా సింహాచలం మరణం పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలిపారు. పార్టీకి, తన కుటుంబానికి చాలా కాలంగా విశ్వసనీయంగా సేవ చేసిన నేతగా ఆయనను కొనియాడారు. విశాఖపట్నం నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసిన కృషి ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థించిన చంద్రబాబు, పల్లా కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.