Loading...
Shamshabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!

Shamshabad airport: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అలర్ట్.. విమానాలకు పెరుగుతున్న లేజర్ ముప్పు!

వ్రాసిన వారు Moogati Shabari
Jul 19, 2026
11:50 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం (ఆర్‌జీఐఏ) పరిసర ప్రాంతాల్లో విమానాల భద్రతకు కొత్త తరహా ప్రమాదం ఎదురవుతోంది. విమానాలు టేకాఫ్ అవుతున్న సమయంలోనూ, ల్యాండింగ్‌కు చేరుకునే వేళలోనూ వాటిపైకి శక్తివంతమైన లేజర్ కిరణాలను ప్రసరించే ఘటనలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. గత రెండేళ్ల వ్యవధిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ పరిధిలోనే ఇలాంటి 100కుపైగా ఘటనలు నమోదవడం విమానయాన రంగంలో తీవ్ర ఆందోళనకు దారితీసింది.

వివరాలు

ల్యాండింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితి..

ఇటీవల జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన లూఫ్తాన్సా విమానం ల్యాండింగ్ సమయంలో ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొంది.

రన్‌వేపైకి దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో విమానం కాక్‌పిట్‌పైకి ఒక్కసారిగా లేజర్ కాంతి ప్రసరించింది.

విమాన ప్రయాణంలో అత్యంత కీలకమైన ల్యాండింగ్ దశలో లేజర్ వెలుతురు నేరుగా పైలట్ల కళ్లపై పడటంతో వారి దృష్టి తాత్కాలికంగా దెబ్బతింది.

అయితే పైలట్లు అప్రమత్తంగా వ్యవహరించడంతో ఎలాంటి ప్రమాదం జరగకుండా పరిస్థితిని సమర్థంగా అదుపులోకి తీసుకువచ్చారు.

పౌర విమానయాన మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం, దేశంలోని 43 విమానాశ్రయాల్లో ఇప్పటివరకు వెయ్యికి పైగా లేజర్ కాంతి ఘటనలు నమోదయ్యాయి.

వీటిలో దాదాపు 10 శాతం కేసులు ఒక్క హైదరాబాద్ విమానాశ్రయ పరిధిలోనే చోటుచేసుకున్నాయి.

వివరాలు

విమాన భద్రతకు తీవ్రమైన ముప్పు..

ముంబై, బెంగళూరు వంటి ప్రధాన నగరాలతో పోల్చితే హైదరాబాద్‌లో ఈ తరహా ఘటనలు రెండింతలు ఎక్కువగా నమోదవుతున్నాయి.

లేజర్ ఘటనల పరంగా దేశంలో ఢిల్లీ, చెన్నై, కోల్‌కతా తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో ఉంది.

ఈ అంశంపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ పైలట్స్ అధ్యక్షుడు కెప్టెన్ సి.ఎస్. రంధావా స్పందిస్తూ.. "కొన్ని సెకన్లపాటు మాత్రమే లేజర్ కాంతి పైలట్ల కళ్లపై పడినా వారు తాత్కాలికంగా చూపును కోల్పోయే ప్రమాదం ఉంది.

అలాంటి పరిస్థితులు విమాన భద్రతకు తీవ్రమైన ముప్పుగా మారవచ్చు" అని హెచ్చరించారు.

ADVERTISEMENT