Sharon Raj murder: బాయ్‌ఫ్రెండ్‌ను చంపిన కేసులో యువతికి కేరళ కోర్టు ఉరిశిక్ష
ఈ వార్తాకథనం ఏంటి
తిరువనంతపురం న్యాయస్థానం (Kerala Court) ప్రియుడిని హత్య చేసిన కేసులో సంచలన తీర్పు ప్రకటించింది.
ఈ కేసులో నిందిత యువతికి ఉరి శిక్ష విధిస్తూ, ఆమెకు సహకరించిన బంధువులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాకు చెందిన గ్రీష్మ (24) కొంతకాలం తిరువనంతపురానికి చెందిన రాజ్ అనే యువకుడితో ప్రేమలో ఉండేది.
2022లో ఆమెకు ఆర్మీలో పనిచేసే మరో వ్యక్తితో పెళ్లి నిశ్చయమైంది. అయినప్పటికీ రాజ్‌తో ఆమె ప్రేమ సంబంధాన్ని కొనసాగించింది.
వివాహ సమయం దగ్గరపడుతుండటంతో రాజ్‌ను దూరం పెట్టేందుకు ప్రయత్నించింది. కానీ రాజ్ ఆమెను వదులుకోవడానికి ఒప్పుకోలేదు.
వివరాలు
నిర్దోషిగా నిందితురాలి తల్లి
దీంతో అతడి అడ్డును పూర్తిగా తొలగించేందుకు గ్రీష్మ హత్య చేయాలని నిర్ణయించుకుంది.
రాజ్‌ను ఇంటికి పిలిచి, అతడికి ఇచ్చిన జ్యూస్‌లో విషం కలిపి ఇచ్చింది. ఆ జ్యూస్ తాగిన రాజ్ ప్రాణాలు కోల్పోయాడు.
ఈ హత్య తర్వాత సాక్ష్యాధారాలను మాయం చేయడానికి ఆమె తన కుటుంబ సభ్యుల సహాయంతో ప్రయత్నించింది. ఈ ఘటన పెద్ద సంచలనంగా మారింది.
న్యాయస్థానం విచారణలో సాక్ష్యాధారాలను సమగ్రంగా పరిశీలించిన తర్వాత, గ్రీష్మను దోషిగా తేల్చింది.
ఇటీవల ఆమెకు ఉరి శిక్షను ఖరారు చేస్తూ తీర్పు వెలువరించింది.
అంతేకాకుండా, హత్యకు సహకరించిన కుటుంబసభ్యులకు మూడేళ్ల జైలు శిక్ష విధించింది.
అయితే తగిన సాక్ష్యాధారాలు లభించకపోవడంతో నిందితురాలి తల్లిని నిర్దోషిగా విడుదల చేసింది.