LOADING...
Delhi Thar Accident: నిమ్మకాయలు తొక్కిస్తుండగా.. షోరూమ్ మొదటి అంతస్తు నుండి పడిన కొత్త థార్‌ SUV..! 
షోరూమ్ మొదటి అంతస్తు నుండి పడిన కొత్త థార్‌ SUV..!

Delhi Thar Accident: నిమ్మకాయలు తొక్కిస్తుండగా.. షోరూమ్ మొదటి అంతస్తు నుండి పడిన కొత్త థార్‌ SUV..! 

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 10, 2025
10:16 am

ఈ వార్తాకథనం ఏంటి

కొత్త కారు కొన్న ఆనందంలో నిమ్మకాయలతో పూజ చేయడానికి చేసిన ప్రయత్నంలో అదికాస్తా ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందపడి ధ్వంసముంది. ఈ సంఘటన దిల్లీలో చోటుచేసుకుంది. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. స్థానిక మీడియా కథనాల ప్రకారం, ఘజియాబాద్‌లోని మాని పవార్‌ అనే మహిళ ఇటీవల రూ.27 లక్షల విలువైన మహీంద్రా థార్‌ (Mahindra Thar) SUV ఆర్డర్‌ చేశారు. సోమవారం, కొత్త కారు తీసుకోవడానికి ఆమె మహీంద్రా షోరూమ్, నిర్మాణ్ విహార్‌కి వెళ్లారు.

వివరాలు 

అనుకోకుండా యాక్సిలేటర్‌ను నొక్కడంతో..

కొత్త కారును బయటకు తీసుకెళ్లే ముందు పూజ చేయాలని మని పవార్‌ భావించారు. ఈ సందర్భంగా, షోరూమ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌లోనే ఆమె థార్‌ SUVతో నిమ్మకాయలను తొక్కించారు. అయితే, అనుకోకుండా ఆమె యాక్సిలేటర్‌ను నొక్కడంతో, వాహనం కంట్రోల్‌ చేయలేక షోరూమ్‌ ఫస్ట్‌ ఫ్లోర్‌ నుంచి కిందకి దూసుకెళ్లింది. వాహనం షోరూమ్‌లోని అద్దాలను బద్దలుకొట్టుకుంటూ, కింద ఉన్న రోడ్డు పైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం సంభవించిన సమయంలో మని, ఆమె భర్త ప్రదీప్ నిర్మన్‌, షోరూమ్ సిబ్బంది థార్‌లో ఉన్నారు. పోలీస్‌లు తెలిపిన వివరాల ప్రకారం, ఎయిర్‌బాగ్‌లు పనిచేశాయి కాబట్టి వారందరికీ ఎటువంటి గాయాలు కాలేదు. ప్రమాదం వెంటనే, బాధితులను దగ్గరలోని ఆస్పత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందజేశారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో ఇదే..