Page Loader
AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం
ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

AP High Court: ప్రభుత్వ కార్యాలయాలు వైజాగ్‌కు తరలింపు.. క్లారిటీ ఇచ్చిన ఏపీ ప్రభుత్వం

వ్రాసిన వారు Jayachandra Akuri
Dec 12, 2023
06:24 pm

ఈ వార్తాకథనం ఏంటి

వైజాగ్‌కు ప్రభుత్వ కార్యాలయాలను తరలిస్తూ ఏపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ రైతు పరిక్షణ సమితి నేలు హైకోర్టు(High Court)లో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఇందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం న్యాయస్థానంలో అఫిడవిట్ దాఖలు చేసింది. రాజధాని ఆఫీసులను వైజాగ్‌కు తరలించడం లేదని, తరలిస్తున్నట్లు వస్తున్న ప్రచారం కేవలం అపోహ మాత్రమేనని వైసీపీ సర్కార్ స్పష్టం చేసింది. ఈ పిటీషన్‌ను త్రిసభ్య ధర్మాసనం ముందుకు పంపాలని రిజిస్ట్రీలో అప్లికేషన్ ఇచ్చినట్లు ప్రభుత్వ న్యాయవాది వెల్లడించారు.

Details

వచ్చే సోమవారానికి కేసు వాయిదా

ఈ కేసు విచారణను వచ్చే సోమవారం నాటికి వాయిదా వేయాలని కోరారు. కార్యాలయాల తరలింపుపై ప్రభుత్వం నుంచి స్పష్టత ఇవ్వాలని నిన్న హైకోర్టు న్యాయమూర్తి ఆదేశించారు. ఈ నేపథ్యంలో కార్యాలయాలను తరలించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు సమాచారమిచ్చింది. అనంతరం కేసు విచారణను వచ్చే సోమవారానికి ఏపీ హైకోర్టు వాయిదా వేస్తున్నట్లు తెలిపింది.