Page Loader
మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?
మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

మే 1నుంచి షిర్డీ సాయిబాబా ఆలయం మూసివేత; ఎందుకో తెలుసా?

వ్రాసిన వారు Stalin
Apr 28, 2023
04:32 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీ సాయిబాబా ఆలయం మే 1 నుంచి నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఆలయ ట్రస్ట్ పేర్కొంది. ఆలయ భద్రత కోసం సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)ను మోహరించాలని భారత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ యాజమాన్యం పిలుపునిచ్చింది. పారిశ్రామిక సంస్థలు, మెట్రో స్టేషన్లు, విమానాశ్రయాలను రక్షించేందుకు మాత్రమే సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం మోహరించింది. ఆలయ భద్రతలో ఇప్పటి వరకు సీఐఎస్ఎఫ్‌ను కేంద్రం ఉపయోగించలేదు. ఇప్పటి వరకు మందిర భద్రత బాధ్యత రాష్ట్ర పోలీసులు చూసుకునేవారు.

షిర్డీ

ఆలయ మూసివేత వల్ల వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం 

2018 నుంచి షిర్డీ విమానాశ్రయంలో సీఐఎస్ఎఫ్‌ భద్రతను పర్యవేక్షిస్తోంది. ఆలయ మూసివేత స్థానికులపై తీవ్ర ప్రభావాన్ని చూపునుంది. సందర్శకులు రాకపోవడం వల్ల హోటళ్లు, దుకాణాలు మొదలైనవాటిని కూడా మూసివేయాల్సి ఉంటుంది. దీంతో వేలాది మంది జీవనోపాధిపై ప్రభావం చూపనుంది. మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌లోని ఒక చిన్న పట్టణంలో ఉన్న ఈ ఆలయానికి ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అన్ని వయసుల వారు, అన్ని మతాల వారు సాయిబాబా ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఆలయ నిర్వహణ బాధ్యతను శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ (ఎస్ఎస్ఎస్‌టీ) నిర్వహిస్తోంది. ఆలయ ప్రాంగణం నిర్వహణ, ఉచిత భోజనం, పాఠశాలలు, కళాశాలల వంటి ధార్మిక సౌకర్యాలను ట్రస్ట్ నిర్వహిస్తుంది.