జనసేనకు షాక్: గాజు గ్లాసు గుర్తును ఫ్రీ సింబల్‌లో చేర్చిన ఈసీ
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల ముంగిట భారత్ ఎన్నికల సంఘం జనసేన పార్టీకి షాకిచ్చింది. జనసేన పార్టీ గుర్తు గాజు గ్లాసును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడంతో ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అయోమయంలో పడ్డారు.
వాస్తవానికి దేశంలోని గుర్తింపు పొందిన పార్టీల వివరాలను ఎన్నికల సంఘం తాజాగా విడుదల చేసింది. ఇందులో జనసేన గుర్తును ఫ్రీ సింబల్ జాబితాలో చేర్చడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఆంధ్రప్రదేశ్‌లోని వైఎస్సార్సీపీ, టీడీపీని ఈసీ గుర్తింపు పొందిన జాబితాలో చేర్చింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే, ఎంఐఎం, బీఆర్ఎస్, టీడీపీ పార్టీలు గుర్తింపు పొందిన జాబితాలో ఉన్నాయి. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, తెలంగాణలో వైసీపీని కూడా గుర్తింపు పొందిన జాబితాలో ఈసీ చేర్చింది.
జనసేన
ఎన్నికల్లో పోటీ చేయకపోవడం వల్లే గుర్తును కోల్పోయిన జనసేన
అయితే జనసేన పార్టీ సింబల్‌ను కోల్పోవడానికి గల కారణాలను ఈసీ వెల్లడించింది. పలు ఎన్నికల్లో జనసేన పోటీ చేయకపోవడం వల్లే గుర్తును కోల్పోవాల్సి వచ్చిందని స్పష్టం చేసింది.
ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం రాజకీయ పార్టీ తన గుర్తును నిలుపుకోవాలంటే, కచ్చితంగా ఎన్నికల్లో ఓట్ల శాతాన్ని పొందాల్సి ఉంటుంది. కానీ కొన్ని ఎన్నికల్లో జనసేన పోటీ చేయలేదు.
అయితే గతేడాది జరిగిన బద్వేలు ఉప ఎన్నికల సమయంలోనే జనసేన గాజు గ్లాసును గుర్తును ఈసీ తొలగించడం గమనార్హం.