LOADING...
Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు షాక్.. సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు
ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు షాక్.. సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు

Kamal Haasan: ఎన్నికల వేళ కమల్‌హాసన్‌కు షాక్.. సొంత పార్టీ నేతల నుంచి తిరుగుబాటు

వ్రాసిన వారు Jayachandra Akuri
Apr 04, 2026
09:41 am

ఈ వార్తాకథనం ఏంటి

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రముఖ నటుడు, ఎంఎన్‌ఎం పార్టీ అధ్యక్షుడు కమల్ హాసన్‌కు అనుకోని పరిణామం ఎదురైంది. ఆయనపై సొంత పార్టీ నేతలే తిరుగుబాటు ప్రారంభించారు. ఎన్నికల్లో పోటీ కోసం ముందుగా సేకరించిన డబ్బులను తిరిగి ఇవ్వాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు. సుమారు 55 మందికి పైగా నాయకులు తాము చెల్లించిన నగదును వెనక్కి ఇవ్వాలని కోరుతున్నారు. అయితే ఈ అంశంపై కమల్ హాసన్ ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి కొనసాగుతోంది. ఈ క్రమంలో కమల్ హాసన్ ఆకస్మికంగా కీలక నిర్ణయం తీసుకుని, తమ పార్టీ ఎన్నికల్లో పోటీ చేయదని ప్రకటించారు. ద్రవిడ మున్నేట్ర కజగంకు మద్దతు ఇస్తున్నట్లు వెల్లడించారు. ఈనిర్ణయం పార్టీ ఆశావాహుల్లో ఆశ్చర్యం కలిగించింది.

వివరాలు

డబ్బులు తిరిగి ఇవ్వాలని డిమాండ్

ఇదిలా ఉండగా ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్న అభ్యర్థుల నుంచి కమల్ హాసన్ ముందుగానే ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు సేకరించారు. ఈ విధంగా మొత్తం 55 మంది అభ్యర్థుల నుంచి నిధులు సమీకరించారు. అయితే ఇప్పుడు పార్టీ పోటీ నుంచి తప్పుకుని డీఎంకేకు మద్దతు ప్రకటించడంతో, ఆ అభ్యర్థులు తమ డబ్బును తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయినప్పటికీ ఈ వివాదంపై కమల్ హాసన్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన రాలేదు. ఇక రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం ఉత్కంఠభరితంగా సాగుతోంది. ప్రధాన పార్టీల మధ్య పోటీ తీవ్రంగా ఉంది.

వివరాలు

మే 4న తుది ఫలితం

మరోసారి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ద్రవిడ మున్నేట్ర కజగం ప్రయత్నిస్తుండగా, ఈసారి గెలవాలని ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం కృషి చేస్తోంది. మరోవైపు అధికారంలోకి రావాలని టీవీకే చీఫ్ విజయ్ కూడా పోరాటం చేస్తున్నారు. ఈసారి తమిళ ప్రజలు ఎవరికీ అధికారాన్ని అప్పగిస్తారన్నది మే 4 వరకు వేచి చూడాల్సి ఉంది.

Advertisement