ED Raids: వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి షాక్.. ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు
ఈ వార్తాకథనం ఏంటి
వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డికి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చింది. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో భాగంగా అవినాశ్ రెడ్డికి చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచే రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ తనిఖీలు ప్రారంభమయ్యాయి. దాదాపు 10 ప్రాంతాల్లో ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు చేపట్టినట్లు సమాచారం. హైదరాబాద్, పులివెందులలో ఉన్న అవినాశ్ రెడ్డి నివాసాలతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా మనీలాండరింగ్‌కు సంబంధించిన వ్యవహారాలు లేదా అనుమానాస్పద ఆర్థిక లావాదేవీలు ఏమైనా జరిగాయా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
వివరాలు
వివేకా కేసు నిందితుల ఇళ్లలోనూ సోదాలు
ఇందుకు సంబంధించిన కీలక పత్రాలు, డాక్యుమెంట్ల కోసం తనిఖీలు చేస్తున్నారు.
అలాగే అవినాశ్ రెడ్డికి సంబంధించిన ఆస్తుల వివరాలను కూడా అధికారులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు.. అవినాశ్ రెడ్డితో పాటు వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న పలువురి ఇళ్లపైనా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
పులివెందులలో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్ నివాసాల్లోనూ తనిఖీలు కొనసాగుతున్నాయి.
తొండూరు మండలం టి.తుమ్మలపల్లిలో ఉన్న ఎర్ర గంగిరెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఇదే సమయంలో పులివెందులలో జగన్‌కు సమీప బంధువైన సునీల్ రెడ్డి ఇంట్లోనూ తనిఖీలు జరుగుతున్నాయి.
వివరాలు
వివేకా కేసు నిందితుల ఇళ్లలోనూ సోదాలు
ఈడీ అధికారులు వేర్వేరు బృందాలుగా ఏర్పడి ఆయా ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఆర్థిక లావాదేవీలు, ఆస్తుల వివరాలు, కీలక పత్రాలకు సంబంధించిన అంశాలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం.