
Delhi: దిల్లీలో షాకింగ్ ఘటన.. ఒక రోజు సెలవు కోసం హత్య చేసిన విద్యార్థులు
ఈ వార్తాకథనం ఏంటి
దేశ రాజధాని దిల్లీలో దారుణం చోటు చేసుకుంది. ఒక రోజు సెలవు కోసం 5 ఏళ్ల బాలుడిని తొటి విద్యార్థులే కొట్టి చంపారు.
ఈ ఘటన యదాల్‌పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాలిమ్ ఉల్ ఖురాన్ అనే మదర్సాలో చోటు చేసుకుంది.
బాలుడి హత్య కేసులో ఇద్దరు 11 ఏళ్ల చిన్నారులు, 9 ఏళ్ల చిన్నారిని పోలీసులు అరెస్టు చేశారు.
5 ఏళ్ల చిన్నారి రుహాన్ మదర్సాలో అపస్మారక స్థితిలో ఉండటంతో తల్లికి సమాచారం అందించారు.
బిడ్డను ప్రయివేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.
Details
సీసీ టీవీ ఆధారంగా కేసు ఛేదించిన పోలీసులు
దీనిపై నిరసనలు రావడంతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
పోస్టుమార్టం రిపోర్టులో చిన్నారి హత్యకు గురైనట్లు తెలిసింది.
దీని తర్వాత పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించగా, అదే మదర్సాలో చదవుతున్న విద్యార్థులు హత్య చేసినట్లు తేలింది.
చంపితే ఒక రోజు మదర్సాకు సెలవు ఇస్తారని హత్య చేసినట్లు ముగ్గురు ఒప్పుకున్నారు.