PM Modi: ట్రంప్ డిన్నర్‌లో కాల్పులు.. హింసను తిప్పికొట్టాలని మోదీ పిలుపు
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజాస్వామ్యంలో హింసకు ఎలాంటి స్థానం లేదని భారత ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వాషింగ్టన్ డీసీలోని వాషింగ్టన్ హిల్టన్ హోటల్లో జరిగిన వైట్ హౌస్ కరెస్పాండెంట్స్ డిన్నర్ సందర్భంగా చోటుచేసుకున్న కాల్పుల ఘటనపై ఆయన 'ఎక్స్' వేదికగా స్పందించారు. ఈ దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు. ఈ ఘటనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, తొలి మహిళ మెలానియా ట్రంప్, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సురక్షితంగా బయటపడటం ఉపశమనం కలిగించిందని మోదీ పేర్కొన్నారు. వారు మరింత భద్రంగా ఉండాలని ఆకాంక్షించారు.
వివరాలు
ఇక ఈ ఘటనపై తీవ్రంగా స్పందించిన ప్రపంచ నేతలు
మార్క్ కార్నీ: "ప్రజాస్వామ్యంలో రాజకీయ హింసకు తావులేదు క్లాడియా షేన్‌బామ్: "హింస ఎప్పటికీ పరిష్కారం కాదు. ట్రంప్, మెలానియా సురక్షితంగా ఉండటం సంతోషకరం" డెల్సీ రోడ్రిగ్స్: "ట్రంప్, మెలానియాపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. శాంతి విలువలకు హింస విరుద్ధం" చింగ్ టె: "ఈ ఘటన నన్ను దిగ్బ్రాంతికి గురి చేసింది. అందరూ సురక్షితంగా ఉండటం ఉపశమనం" ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీయగా, ప్రజాస్వామ్య దేశాల్లో భద్రతా అంశాలపై మళ్లీ దృష్టి సారించేలా చేసింది.