Page Loader
Hyderabad: మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి
మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి

Hyderabad: మలక్‌పేటలోని శాలివాహన నగర్ లో పార్కులో వాకర్స్ పై కాల్పులు.. ఒకరి మృతి

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 15, 2025
08:22 am

ఈ వార్తాకథనం ఏంటి

హైదరాబాద్ మలక్‌పేటలోని శాలివాహన నగర్‌లో కాల్పులు కలకలం సృష్టించాయి. శాలివాహన నగర్‌లో ఉన్న పార్క్‌లో వాకింగ్‌కు వెళ్లిన ప్రజలపై గుర్తుతెలియని దుండగులు విచక్షణరహితంగా కాల్పులు జరిపారు. ప్రత్యేకంగా చందు నాయక్ అనే వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని దుండగులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. అకస్మాత్తుగా జరిగిన ఈ కాల్పులతో పార్క్‌లో ఉన్న వాకర్లు ప్రాణభయంతో పరుగులు తీశారు. ఈ అనూహ్య ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని అక్కడ పరిస్థితిని సమీక్షించారు. అనంతరం ఘటనకు సంబంధించి పూర్తి వివరాలను సేకరించేందుకు విచారణ ప్రారంభించారు. ఈ కాల్పుల ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.