Gunfire in America: అమెరికాలో మరోసారి కాల్పుల మోత.. ఏపీ యువకుడికి తీవ్ర గాయాలు
ఈ వార్తాకథనం ఏంటి
అగ్రరాజ్యం అమెరికాలో కాల్పుల ఘటనలు ఆగడంలేదు. తాజాగా మెమ్ఫిస్ నగరంలో చోటుచేసుకున్న కాల్పుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గోవిందపురం పంచాయతీకి చెందిన మోహన్ సాయి అక్కడ సాఫ్ట్‌వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు.
గురువారం రాత్రి 11.30 గంటల సమయంలో మోహన్ సాయి తన స్నేహితుడితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా, గుర్తుతెలియని దుండగులు కాల్పులు జరిపారు.
ఈ ఘటనలో మోహన్ సాయి కుడి భుజం, చేతిపై బుల్లెట్లు దిగి తీవ్రగాయాలయ్యాయి.
Details
అండగా ఉంటామని భరోసా ఇచ్చిన ఎమ్మెల్యే బొజ్జల
అతను ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి మోహన్ సాయి కుటుంబంతో ఫోన్‌లో మాట్లాడి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
గతంలో కూడా అమెరికాలో జరిగిన కాల్పుల ఘటనల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, ఉద్యోగులు గాయపడటం, ప్రాణాలు కోల్పోవడం తెలిసిందే.
ఈ ఘటన మరికొంత ఆందోళనకు కారణమవుతోంది.