
Nirmala Sitharaman: మద్యం జీఎస్టీలో చేర్చాలా? స్పష్టత ఇచ్చిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్!
ఈ వార్తాకథనం ఏంటి
రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న మద్యం అమ్మకాలను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలన్న చర్చ పెద్దకాలంగా జరుగుతోంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం జీఎస్టీలో సంస్కరణలు చేపట్టి ష్రేడ్‌లను తగ్గించిన సంగతి తెలిసిందే. దీని ఫలితంగా నిత్యావసర వస్తువుల ధరలు తగ్గి, మధ్యతరగతి వర్గానికి ఊరట లభిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఇక మద్యం జీఎస్టీ పరిధిలోకి చేర్చాలన్న డిమాండ్ పై మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టత ఇచ్చారు. మద్యం జీఎస్టీ పరిధిలో చేర్చాలా లేదా అనే నిర్ణయం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వాల చేతిలో ఉందని, ఈ విషయంలో కేంద్రం ప్రత్యేకంగా స్పందించనుందని చెప్పారు.
Details
ప్రతిపాదనను తిరస్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు
ప్రస్తుత చట్టాల ప్రకారం, మద్యం తయారీ మరియు అమ్మకాలపై పన్ను విధించే అధికారం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే ఉంది. మద్యం తయారీపై ఎక్సైజ్ సుంకం, అమ్మకాలపై వ్యాట్ విధించడం ద్వారా పెద్ద మొత్తంలో ఆదాయం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చేరుతోంది. మరింత స్పష్టంగా చెప్పాలంటే, మద్యం తయారీ, అమ్మకం ప్రభుత్వాలకు కీలక ఆదాయ వనరుగా మారింది. అందువల్ల, మద్యాన్ని జీఎస్టీ పరిధిలోకి చేర్చితే రాష్ట్రాల, కేంద్రపాలిత ప్రాంతాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది. ఇదే కారణంగా ఈ ప్రతిపాదనను చాలా రాష్ట్ర ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి.