
శ్రద్ధా వాకర్ హత్య కేసులో సంచలనాలు: ఎముకలను కాల్చి, గ్రైండ్ చేసిన ఆఫ్తాబ్
ఈ వార్తాకథనం ఏంటి
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కాల్ సెంటర్ ఉద్యోగి శ్రద్ధా వాకర్ హత్య కేసుకు సంబంధించిన మరికొన్ని సంచలన విషయాలు బయటికి వచ్చాయి. దిల్లీ పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల ఛార్జ్‌షీట్‌లో ఆ విషయాలు ఉన్నాయి.
ఆఫ్తాబ్ పూనావాలా తన ప్రేయసి శ్రద్ధా వాకర్‌ను హత్య చేసిన తర్వాత ఆమె ముఖం, తలను బ్లోటోర్చ్‌తో ఎవరూ గుర్తు పట్టకుండా వికృతంగా మార్చినట్లు పోలీసులకు వెల్లడించాడు. శ్రద్ధా ఎముకలను కాల్చి, వాటిని గ్రైండ్ చేసినట్లు పేర్కొన్నారు.
హత్య జరిగిన రోజు రాత్రి, ఆఫ్తాబ్ సమీపంలోని హార్డ్‌వేర్ దుకాణానికి వెళ్లి ఒక రంపపు, మూడు బ్లేడ్‌లు, ఒక సుత్తి, ప్లాస్టిక్ క్లిప్‌లను కొనుగోలు చేసినట్లు పూనావాలా పోలీసులకు చెప్పాడు.
శ్రద్ధా వాకర్
విడి భాగాలు కుళ్లిపోకుండా ఉండేందుకు కొత్త ఫ్రిజ్‌లో పెట్టన పూనావాలా
మృతదేహాన్ని బాత్రూమ్‌కు తీసుకెళ్లి, రంపంతో ఆమె చేతులను కోసి, పాలిథిన్ బ్యాగ్‌లో పెట్టినట్లు, వంటగది దిగువ క్యాబినెట్‌లో సంచులను దాచినట్లు చార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.
హత్య చేసిన మరుసటి రోజు తెల్లవారుజామున 2 గంటలకు ఛత్తర్‌పూర్ అటవీ ప్రాంతంలో శ్రద్ధా శరీరం తొడ భాగాన్ని పారవేసానని పోలీసులకు పూనావాలా వివరించాడు. ఆ తర్వాత 4 నుంచి 5 రోజుల్లో శ్రద్ధా శరీరాన్ని ఆఫ్తాబ్ 17ముక్కలుగా కట్ చేసినట్లు ఒప్పుకున్నాడు.
ఆ తర్వాత ఆమె శరీర భాగాలను ఒక్కొక్కటిగా పారవేసినట్లు, విడి భాగాలు కుళ్లిపోకుండా ఉండేందుకు తాను కొత్తగా కొన్న ఫ్రిజ్‌లో ఉంచినట్లు పోలీసుల ఎదుట పూనావాలా అంగీకరించారు.