Page Loader
శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు
శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కేసులో ఒకరు అరెస్టు

శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంకు కుంభకోణం: 1000కోట్ల స్వాహా కేసులో ఒకరు అరెస్టు

వ్రాసిన వారు Stalin
Feb 23, 2023
05:47 pm

ఈ వార్తాకథనం ఏంటి

రూ.1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో శ్రీ గురు రాఘవేంద్ర సహకార బ్యాంక్ వీఆర్ రాజేష్ అనే వ్యక్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) గురువారం అరెస్టు చేసింది. బ్యాంకులో స్వాహా చేసిన సొమ్ములో రాజేష్ ప్రధాన లబ్ధిదారుడని ఈడీ తెలిపింది. బ్యాంక్ మేనేజ్‌మెంట్‌కు సన్నిహితంగా ఉండి భారీ మొత్తంలో రుణాలను పొందినట్లు ఈడీ ఆరోపించింది. రాజేష్ తో పాటు అతని భార్యకు రుణాలు తీసుకోవడం, చెల్లించకపోవడం అలావాటని, గతంలో కూడా వారిపై పలు కేసులు నమోదైనట్లు ఈడీ ఈసందర్భంగా పేర్కొంది.

కర్ణాటక

అధిక వడ్డీని ఆశ చూపిన బ్యాంకు అధికారులు

మార్కెట్ రేటు ప్రకారం కాకుండా డిపాజిటర్లకు అధిక వడ్డీ రేటును ఇస్తామని బ్యాంకు నిర్వాహకులు డిపాజిట్లు సేకరించినట్లు ఈడీ వివరించింది. బ్యాంక్ అధికారులు కల్పిత రుణ ఖాతాలను సృష్టించి, ఆ సోమ్మును అందులోకి మళ్లించినట్లు ఈడీ విచారణలో తేలింది. గతంలో ఈ కేసుకు సంబంధించి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ నిందితులకు చెందిన రూ.45.32 కోట్ల విలువైన చర, స్థిరాస్తులను అటాచ్ చేసింది. బెంగళూరులోని ప్రిన్సిపల్ సిటీ సివిల్ అండ్ సెషన్స్ జడ్జి రాజేష్‌ను మూడు రోజుల ఈడీ కస్టడీకి అప్పగించారు. రూ. 1000 కోట్లకు పైగా పబ్లిక్ డిపాజిట్లను దుర్వినియోగం చేసిన కేసులో బెంగళూరు పోలీసులు ఇప్పటికే పలువురిపై కేసులు నమోదు చేసారు.