LOADING...
Telangana: చింతపల్లిలో మళ్లీ సందడి చేసిన సైబీరియా కొంగలు
చింతపల్లిలో మళ్లీ సందడి చేసిన సైబీరియా కొంగలు

Telangana: చింతపల్లిలో మళ్లీ సందడి చేసిన సైబీరియా కొంగలు

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 20, 2026
11:07 am

ఈ వార్తాకథనం ఏంటి

ఎన్నో సంవత్సరాలుగా 'అంతర్జాతీయ అతిథులు'గా పేరుపొందిన సైబీరియా కొంగలు వచ్చి చేరేకాలంలో ఖమ్మం గ్రామీణ మండలం చింతపల్లి గ్రామం ప్రత్యేకంగా కళకళలాడేది. ముఖ్యంగా ఎర్రకాళ్ల కొంగలు వేలాది కిలోమీటర్లు ఎగిరి ఈగ్రామానికి చేరుకుని చెట్లపై గూళ్లుకట్టుకుని నివాసం ఏర్పరుచుకునేవి. ఇక్కడే సంతానాన్నిపెంచుకుని,జూన్ నెల చివరికి తిరిగి తమ స్వస్థలాలకు వెళ్లిపోయేవి. అయితే గతకొన్నేళ్లుగా గ్రామంలో కోతుల సంఖ్య అధికంగా పెరగడంతో ఈ పక్షులు రావడం తగ్గింది. ఈపరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ అధికారులు చింతపల్లి గ్రామాన్ని తమ పరిధిలోకి చేర్చారు. చెట్లు నరికివేయకుండా ఉండాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడమే కాకుండా,కోతులను దూర ప్రాంతాలకు తరలించే చర్యలు కూడా చేపట్టారు. ఈకృషి ఫలితంగా ఈసంవత్సరం విదేశీ పక్షులు మళ్లీ గ్రామానికి చేరుకుని సందడి చేస్తున్నాయి.

Advertisement