కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్
ఈ వార్తాకథనం ఏంటి
కర్ణాటక ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆధ్వర్యంలోని పార్టీ అధిష్టానం కర్ణాటక తదుపరి ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య పేరును ఖరారు చేసింది.
సీఎం పీఠాన్ని ఆశించిన మరో నాయకుడు డీకే శివకుమార్‌ను డిప్యూటీగా సీఎంగా ఎంపిక చేశారు.
మే 20న బెంగళూరులో ఈ ఇద్దరు ప్రమాణస్వీకారం చేసే అవకాశం ఉంది.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ చీఫ్ రాహుల్ గాంధీ మధ్య బుధవారం పలు రౌండ్ల చర్చలు అనంతరం సీఎంను ఖరారు చేశారు.
కర్ణాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (కేపీసీసీ) చీఫ్ డికె శివకుమార్ ఒక అడుగు వెనక్కి తగ్గడంతో రాహుల్, ఖర్గే ఊపిరిపీల్చుకున్నారు.
కర్ణాటక
సీఎం పదవి రొటేషన్‌పై స్పష్టత లేదు
ముఖ్యమంత్రి పదవికి రొటేషన్ పీరియడ్ ఉంటుందా లేదా అనే విషయంపై క్లారిటీ లేదు.
ఇద్దరు నేతలకు ఒక్కొక్కరికి 2.5 ఏళ్లు వస్తాయని శివకుమార్‌కు సన్నిహితులు చెబుతున్నారు. అయితే దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత రాలేదు.
2024 జాతీయ ఎన్నికల తర్వాత పదవికి రొటేషన్ పీరియడ్‌పై స్పష్టత రావొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే పోర్ట్‌ఫోలియోలు ఇంకా ఖరారు కానప్పటికీ శివకుమార్‌కు కీలక పదవులు వస్తాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.
అన్ని వివరాలు త్వరలో వెలువడనున్నాయి. అయితే ప్రస్తుతం డీకే-సిద్ధరామయ్య మధ్య ఒక స్పష్టమైన ఒప్పందం కుదిరినట్లు స్పష్టమైంది.